/rtv/media/media_files/2025/02/15/fNo7zzxPZltuiqICRPY0.webp)
Lawyer shot dead in bihar
Crime:బీహార్‌లో కాల్పుల పరంపర కొనసాగుతోంది. పాట్నా వ్యాపారి గోపాల్ ఖేమ్కాను అగంతకులు కాల్చిచంపిన ఘటన మరువక ముందే మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మరోక వ్యక్తిని పట్టపగలే దుండగులు కాల్చి చంపడం సంచలనంగా మారింది. ఆదివారం పట్టపగలు సుల్తాన్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. జితేందర్ కుమార్ అనే న్యాయవాదిపై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టపగలే కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయా భ్రాంతులకు గురయ్యారు.
ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
స్థానికంగా గుర్తింపు పొందిన లాయర్ జితేందర్ కుమార్ రెగ్యులర్‌గా టీ తాగే షాపులో టీ తాగి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.అనంతరం దుండుగులు అక్కడి నుంచి పరారైనట్టు పాట్నా ఈస్ట్ ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన లాయర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందినట్టు చెప్పారు. ఘటనా స్థలం నుంచి మూడు ఖాళీ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లోంచి విచారణ చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా హంతకులను పట్టుకుంటామని అన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్‌లో గత 24 గంటల్లో చోటు చేసుకున్న కాల్పుల సంఘటనల్లో నలుగురు మరణించడం స్థానికంగా కలకలం సృష్టించింది.
Also Read: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్