Chimney Collapse: కుప్పకూలిన చిమ్నీ.. 8 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. ముంగేలీ జిల్లాలోని ఓ పరిశ్రమలో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
Chimney Collapse

Chimney Collapse

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. ముంగేలీ జిల్లాలోని ఓ పరిశ్రమలో నిర్మాణంలో ఉన్న చిమ్నీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో 9 మంది కార్మికులు మృతి చెందారు. 25 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.  

Also Read: అమెజాన్ కొత్త సేల్.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లే ఆఫర్లు!

ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంగేలి జిల్లాలో కుసుమ్ స్టీల్ ప్లాంట్‌లో చిమ్నీని నిర్మిస్తున్నారు. భారీస్థాయిలో సామాగ్రిని నిల్వచేసేందుకు  నిర్మాణం జరుగుతోంది. పనులు జరుగుతున్న క్రమంలోనే గురువారం మధ్యాహ్నం ప్రమాదవాత్తు అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని ముంగేలి జిల్లా ఎస్పీ భోజ్‌రామ్ పటేల్ తెలిపారు. అలాగే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. 

Also Read: చైనాలో మళ్లీ కొత్త వైరస్ కలకలం.. వెలుగు చూసిన కొత్త వేరియంట్

Also Read: పట్టపగలే యువతిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి పొడిచి! (వీడియో వైరల్)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు