చైనాలో మళ్లీ కొత్త వైరస్ కలకలం.. వెలుగు చూసిన కొత్త వేరియంట్

చైనాలో మళ్లీ కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. కొత్త మ్యుటేటెడ్ పాక్స్ స్ట్రెయిన్ క్లాడ్ ఐబిని గుర్తించినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. దీంతో డబ్ల్యూహెచ్ఓ అత్యవసర స్థితిని ప్రకటించింది. కాంగో నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు.

New Update
china virus

china virus Photograph: (china virus )

చైనాలో మళ్లీ కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే  కొత్త మ్యుటేటెడ్ పాక్స్ స్ట్రెయిన్ క్లాడ్ ఐబిని గుర్తించినట్లు చైనా ఆరోగ్య అధికారులు 2025 జనవరి 9 గురువారం రోజున  తెలిపారు. దీంతో ప్రపంచ ఆరోగ్య  సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర స్థితిని ప్రకటించింది. కాంగో నుంచి చైనాకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఎంపాక్స్ క్లేడ్ ఐబి వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు  చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులు.  సదరు కాంగో ప్రయాణికుడితో సన్నిహితంగా ఉండడం వల్ల మరో నలుగురికి ఈకొత్త వేరియంట్‌ సోకిందని తెలిపారు అధికారులు.  చైనాలో ఇప్పటికే ఎంపాక్స్ ఐబి వెర్షన్ వేగంగా విస్తరిస్తుంది.  ఇప్పటికే కాంగో, బురుండి, కెన్యా, రువాండ, ఉగాండాలో ఈ వైరస్  విజృంభిస్తుంది.  దీంతో డబ్ల్యూహెచ్‌ఓ సైతం తాజాగా, హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. 

ఎంపాక్స్ లక్షణాలు 

ఎంపాక్స్ విషయానికి వస్తే 1958లోనే  దీనిని కనుగొన్నారు అధికారులు. కోతుల్లో ఈ వైరస్ ను కనుగొనడం వలన దీనికి మంకీపాక్స్‌ పేరుగా నామాకరణం చేశారు. 1970లో మనుషుల్లో దీన్ని  తొలిసారిగా గుర్తించారు. కాంగోకు చెందిన  తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్‌ సోకింది. ఈ వ్యాధి సోకిన వారి లక్షణాలు  జ్వరం, కండరాల నొప్పులు, శరీరంపై నీటి బొబ్బలు వస్తాయి. వెంటనే చికిత్స అందించకపోతే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఎంపాక్స్‌కు చికిత్స, వ్యాక్సిన్‌ లేవు. స్వల్ప లక్షణాలు కనిపిస్తే మాత్రం దానంతంట అదే తగ్గిపోతుంది. మశూచికి వాడే టికోవిరమాట్‌ (టీపీఓఎక్స్‌ ఎక్స్‌) యాంటీ వైరల్‌నే దీనికీ వాడుతున్నారు.  

హెచ్​ఎంపీ వైరస్ లక్షణాలు 

ఇక చైనాలో హెచ్​ఎంపీ వైరస్ వీవిజృంభిస్తున్న సంగతి తెలిసిందే.  హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ సాధారణంగా ఫ్లూ లేదా జలుబు లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఉన్నవారు దగ్గిన, తుమ్మిన, శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది. మొదట దగ్గు, కొద్దిపాటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడతారు.   ఈ వైరస్‌ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి.  దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు క్లాత్ అడ్డంగా పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి.

Also Read :  గనిలో పనిచేస్తుండగా 16మంది కిడ్నాప్‌..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు