ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్ అమెజాన్ మరో కొత్త సేల్ ప్రకటించింది. ""గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025""ను తీసుకొచ్చింది. తాజాగా ఈ సేల్ తేదీలు వెల్లడయ్యాయి. ముందుగా ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్‌లపై 65 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, అమెజాన్ పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్ ఉత్పత్తులు, కిచెన్‌వేర్ మరిన్ని కూడా సేల్ సమయంలో భారీ తగ్గింపుతో అందుబాటులోకి రానున్నాయి. Also Read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు Amazon Great Republic Day Sale 2025 date అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 తేదీ విషయానికొస్తే.. జనవరి 13న అందరికీ ఈ సేల్ అందుబాటులోకి రానుంది. అయితే ప్రైమ్ యూజర్లకు 12 గంటల ముందు ఈ సేల్ రానుంది. SBI కార్డ్ హోల్డర్లు క్రెడిట్, EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. అలాగే కొనుగోలుదారులు ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ ఆధారిత ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు, అలాగే కూపన్ డిస్కౌంట్‌లను కూడా సేల్ సమయంలో పొందవచ్చు. సేల్ సమయంలో కొనుగోలుదారులు నో-కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా ఎంచుకోవచ్చు. Amazon Great Republic Day Sale 🎉🇮🇳 #Amazonsale #RepublicDaysale pic.twitter.com/eemBEkFX68 — Azaz Khan (@thenameisazaz) January 7, 2025 Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు! Mobile Phone Offers అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 సమయంలో Apple, OnePlus, Samsung, iQoo, Realme, Xiaomi వంటి మొబైల్ ఫోన్‌లు, యాక్ససరీలపై 40 శాతం వరకు తగ్గింపును పొందొచ్చు. అంతేకాకుండా కొత్తగా ప్రారంభించిన OnePlus 13, OnePlus 13R, iQOO 13 5G, iPhone 15, Samsung Galaxy M35 5G ధరలపై భారీ తగ్గింపులను అదించనుంది. వీటితో పాటు Honor 200 5G, Galaxy S23 Ultra, Realme Narzo N61, Redmi Note 14 5Gలపై కూడా తగ్గింపులు పొందొచ్చు. Amazon Great Republic Day Sale starts on January 13, 2025.#Amazon pic.twitter.com/sqEYipCoRP — Halka Tech (@Halkatech) January 7, 2025 Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త రాబోయే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, ప్రొజెక్టర్లపై 65 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, మౌస్ వంటి ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలు రూ.199 ప్రారంభ ధరతో లభిస్తాయి. అమెజాన్ అలెక్సా, ఫైర్ టీవీ ఉత్పత్తులు ఈ సేల్‌లో రూ.2,599 నుండి ప్రారంభమవుతాయి. Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్! అమెజాన్ ఫ్యాషన్ ఉత్పత్తులను రూ.199 లకు సేల్‌లో కొనుక్కోవచ్చు. రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువుల ప్రారంభ ధర రూ.149 నుంచి ఉంటుంది. ఇంకా, Amazon Pay ద్వారా చేసే ప్రయాణ బుకింగ్‌లకు 50 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.