Starbucks : తంతే స్టార్‌బక్స్ లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం

లాస్ ఏంజెల్స్ స్టార్‌బక్స్ నిర్లక్ష్యం కారణంగా డెలివరీ బాయ్‌కు కాలిన గాయాలు అయ్యాయి. మూత సరిగా పెట్టకపోవడంతో హాట్ డ్రింక్స్ మైఖేల్ గార్సియాపై పడ్డాయి. అతను నష్టపరిహారం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు 50మిలియన్ డాలర్లు(434 కోట్లు) అతనికి చెల్లించాలంది.

New Update
Starbucks

Starbucks Photograph: (Starbucks)

అదృష్టం అంటే ఇదే అనుకుంటా.. తంతే గారె బుట్టలో పడ్డాడని ఓ సామెత ఉంది. అయితే దానికి పోలినట్లే అమెరికాలో ఓ సంఘటన చోటుచేసుకుంది. స్టార్‌బక్స్ డెలివరీ డ్రైవర్ అయిన ఓ వ్యక్తి నక్తతోక తొక్కాడు. ఎందుకంటే స్టార్‌బక్స్ కంపెనీ నుంచి అతను పెద్ద మొత్తంలో నష్టపరిహారం పొందాడు. కాలిఫోర్నియాలోని స్టార్‌బగ్స్ సెంటర్ నుంచి డ్రింక్స్‌ ఆర్డర్ తీసుకొని మైఖేల్ గార్సియా బయలుదేరాడు. అతడు  ఆర్డర్ లాస్ ఏంజిల్స్‌లో డెలివరీ చేయాలి. కానీ అనుకోకుండా అందులో ఓ వేడి వేడి డ్రింక్ ఒలిగిపోయి డ్రైవర్ మీద పడింది.

Also read: US airstrikes: అమెరికా వైమానిక దాడిలో 19 మంది మృతి!

దీంతో అతనికి గాలిన గాయాలు అయ్యాయి. స్టార్‌బక్స్ సెంటర్‌లో మూత సరిగ్గా పెట్టకపోవడంతోనే బ్యారెన్ మూత ఊడిపోయి డ్రైవర్‌కు ప్రమాదం జరిగింది. ఈ ఘటన 2020 ఫిబ్రవరి 8న చోటుచేసుకుంది. వేడి వేడి పానియాలు పడినందుకు తనకు తీవ్రంగా గాయాలైయ్యాయని కోర్టును ఆశ్రయించాడు. స్టార్‌బక్స్ కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే తనకు తీవ్రంగా నష్టం జరిగిందని కోర్టుకు ఎక్కాడు. తన క్లైయింట్‌కు తాకిన గాయాల కారణంగా మానసికంగా, శారీరకంగా బాగా నష్టపోయాడని మైఖేల్ గార్సియా తరుపు న్యాయవాది వాదించాడు.

Also read: Pakistan terrorist : పాకిస్తాన్‌లో హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది

కోర్టు విచారణకు ముందు స్టార్‌బక్స్ బాధితుడికి సెటిల్‌మెంట్ ఆఫర్‌లను ఇచ్చింది. కోర్టు నుంచి కేసు వాపస్ తీసుకుంటే ఫస్ట్ 3 మిలియన్లు డాలర్లు (సుమారు రూ. 26 కోట్లు)  ఇస్తామన్నా దానికి మైఖేల్ గార్సియా ఒప్పకోలేదు. తర్వాత 30 మిలియన్ల(సుమారు రూ. 261 కోట్లు) డాలర్లు ఇస్తామని చెప్పింది. మైఖేల్ గార్సియా దీనికి సరే అన్నాడు. కానీ హాట్ డ్రింక్స్‌ను కస్టమర్లకు డెలివరీ చేసే ముందు వాటి సేఫ్టీ రెండుసార్లు చెక్ చేయాలని కంపెనీకి షరతు పెట్టాడు. దీనికి కంపెనీ ఒప్పుకోలేదు. కోర్టులో ఈ కేసు ఫైనల్ హియరింగ్‌‌కు చేరింది. కాలిఫోర్నియాలోని జ్యూరీ మైఖేల్ గార్సియాకు నష్టపరిహారంగా స్టార్‌బక్స్‌ 50 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 434.78 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. స్టార్‌బక్స్ మూత సరిగా పెట్టనందుకే డెలివరీ డ్రైవర్‌ గాయాలపాలైయ్యాడని కోర్టు తీర్పు చెప్పింది. స్టార్‌బక్స్ నిర్లక్ష్యం కారణంగా బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు