Gas Price Hike: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.209 పెంచాయి. ఈ ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ ధరల పెరుగుదలతో, న్యూఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.1731.50 అవుతుంది. నెల రోజుల క్రితమే, చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలను రూ.158 తగ్గించాయి. ఇది సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చింది. పండగల ముందు సిలిండర్ ధరలను పెంచి వినియోగదారులకు షాకిచ్చాయి చమురు కంపెనీలు.
/rtv/media/media_files/2025/04/01/1Nsnsuw3Dsp3UO6n78Xq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gas-cylinders-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/cylinder-price-jpg.webp)