Kerala Viral Video: బావిలో పడిపోయిన భర్త.. ప్రాణాలకు తెగించి కాపాడిన భార్య

ఓ భార్య.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తన భర్తను కాపాడుకుంది. బావిలో పడిపోయిన తన భర్తను కాపాడి.. అతడికి పునర్జన్మను ప్రసాదించింది. ఈ ఘటన కేరళలోని పిరవమ్ ప్రాంతంలో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Kerala Woman, 56, Rescues Husband Who Fell Into 40-Foot Well

Kerala Woman, 56, Rescues Husband Who Fell Into 40-Foot Well

Kerala Viral Video: భార్య భర్తల మధ్య ప్రేమ, అప్యాయలు ఉండటంతో పాటు చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు రావడం సహజమే.  కానీ వాళ్లలో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం తట్టుకోలేరు. వాళ్లని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. అయితే తాజాగా ఓ భార్య.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తన భర్తను కాపాడుకుంది. బావిలో పడిపోయిన తన భర్తను కాపాడి.. అతడికి పునర్జన్మను ప్రసాదించింది. ఈ ఘటన కేరళలోని పిరవమ్ ప్రాంతంలో జరిగింది.  

Also Read: పేరుకి గజదొంగ.. ప్రేమలో ఆణిముత్యం: చోరీ సొమ్ముతో ప్రియురాలికి రూ.3కోట్ల ఇల్లు!

ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. ఇక వివరాల్లోకి వెళ్తే.. పిరవమ్ అనే ప్రాంతంలో రమేశన్(64) , పద్మ(56) దంపతులు జీవిస్తున్నారు. బుధవారం ఉదయం తమ ఇంటి వద్ద ఉన్న మిరియాల చెట్టుపైకి రమేశన్ ఎక్కాడు. మిరియాలు తీస్తుండగా.. ప్రమాదవశాత్తు ఆ చెట్టు విరిగింది. దీంతో రమేశ్‌ పక్కనే ఉన్న 40 అడుగుల లోతైన బావిలో పడిపోయాడు. దీన్ని గమనించిన అతడి భార్య వెంటనే తాడు సాయంతో బావిలోకి దిగింది.  

Also Read: భర్తకు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ప్రియుడితో శృంగారం.. చివరికి ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్!

సుమారు 20 నిమిషాల పాటు నీటిలోనే..

ఆ సమయానికి రమేశ్ స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ పద్మ.. తన భర్తను ఒడిపట్టుకొని సుమారు 20 నిమిషాల పాటు నీటిలోనే ఉంది. ఆమె కేకలు విని వచ్చిన స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. సహాయక సిబ్బంది కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. వల సాయంతో వాళ్లని సురక్షితంగా బయటికి తీశారు. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రికి తరలించారు. భర్త ప్రాణాలు కాపాడేందుకు పద్మ తన ప్రాణాలకు తెగించి మరీ కాపాడుకోవండపై స్థానికులు, అధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  

Also Read: పంజాబ్‌లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. కేజ్రీవాల్‌ను టార్గెట్‌ చేసిన బీజేపీ

Also Read: మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు