/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Hidma-Encounter-jpg.webp)
Karregutta Operation big update Hidda Escape
Maoist Hidma: ఆపరేషన్ కర్రెగుట్ట నుంచి మరో బిగ్ అప్‌డేట్ వెలువడింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మద్వి హిడ్మా భద్రతాబలగాల వలయం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ములుగు అడవుల్లోకి హిడ్మాతోపాటు PLGA బెటాలియన్ ప్రవేశించినట్లు ఛత్తీస్ ఘఢ్ నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.
ములుగు అడవుల్లోకి ప్రవేశం..
ఈ మేరకు కర్రెగుట్టపై గత వారంనుంచి ఆపరేషన్ కొనసాగుతుండగా.. పోలీసుల వాసన పసిగట్టిన పీఎల్జీఏ బెటాలియన్ -1 కమాండర్ మాద్వి హిడ్మా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. హిడ్మాతో పాటు PLGA బెటాలియన్ వెంట దేవా, సుజాత, పుల్లూరి ప్రసాద్ రావ్ తెలంగాణలోని తడపాల, వెంకటాపురం, ములుగు అడవుల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై పీస్ కమిటీ ప్రతినిధుల ఒత్తిడితో తెలంగాణ బలగాలు ఆశించిన స్థాయిలో కర్రెగుట్టలను ముట్టడించలేదని ఛత్తీస్ ఘఢ్ భద్రతాబలగాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే మావోయిస్టులు అక్కడినుంచి పరారైనట్లు సమాచారం.
శాంతి చర్చల ఎఫెక్టు..
మావోలతో శాంతి చర్చలు జరపాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బహిరంగంగానే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని తెలంగాణ ప్రజాప్రతినిధుల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై భధ్రతాబలగాల అసహనం వ్యక్తం చేస్తున్నాయట. భధ్రతాబలగాల సహకారం లేకుంటే ప్రణాళిక ప్రకారం కౌంటర్ అఫెన్స్ కష్టతరమవుతుందని, తెలంగాణ ప్రభుత్వం మావోలతో శాంతి చర్చల ప్రతిపాదనకే మొగ్గుచూపడంతో భధ్రతాబలగాల మధ్య సమన్వయం కొరవడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రంగంలోకి ఛత్తీష్ గఢ్ బలగాలు..
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగించాలని ఛత్తీస్ ఘఢ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పడికే కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న కేంద్రపారామిలిటరీ బలగాలు.. తెలంగాణ బలగాల సహకారం సరిహద్దులో ఆశించిన మేరలేకపోవడంతో ఛత్తీస్ ఘఢ్ నుంచి మరిన్ని బలగాలను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఛత్తీస్ ఘఢ్ ప్రభుత్వం అత్యవసర అంతర్గత సమావేశం నిర్వహించగా.. ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ దేకా, ఛత్తీస్ ఘఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్, సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, ఛత్తీస్ ఘఢ్ పోలీస్ ఏడీజీ వివేకానంద సిన్హా, ఎస్ఎస్ బీ, సీఏపీఎఫ్ అధికారులు ఆపరేషన్ కర్రెగుట్టను ఒంటరిగానైనా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు
కర్రెగుట్టల్లో నిరంతర కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్న బలగాలు.. బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయట. మావో అగ్రనేతలు తప్పించుకున్నప్పటికీ షెల్టర్ జోన్లు, సేఫ్ జోన్లు లేకుండా చేయాలని చూస్తున్నారట. కర్రెగుట్టల్లో ద్వితీయ శ్రేణి మావోయిస్టులు భారీ సంఖ్యలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో కర్రెగుట్టల చుట్టూ విస్తృత కూంబింగ్ నిర్వహించాలనుకుంటున్నారు. అయితే మావోయిస్టుల కాల్పుల విరమణ విజ్ఞప్తిని ఎత్తుగడగానే భావిస్తున్న భధ్రతాబలగాలు.. ప్రస్తుత పరిస్థితుల్లో సైనికచర్యను సడలిస్తే భవిష్యత్తులో మావోయిస్టులను నిర్మూలించడం అసాధ్యంగానే భావిస్తున్నారట.
chattisaghad | mulugu | telugunews | madvi hidma