భర్త సఖ్యతతో ఉండటం లేదని, ఇతరులతో సంబంధం పెట్టుకున్నారని భార్యలు కేసులు పెట్టడం చూస్తునే ఉంటాం. కానీ ఓ భార్య పిల్లి కారణంగా భర్తపై కేసు పెట్టిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే భార్యపై చూపించాల్సిన ప్రేమను తన పెంపుడు పిల్లిపై చూపిస్తున్నాడని కర్ణాటకకు చెందిన మహిళ భర్తపై గృహ హింస కేసు నమోదు చేసింది. పిల్లి వల్ల ఇద్దరి మధ్య లొల్లి అయ్యిందని తన భర్తపై ఐపీసీ సెక్షన్ 498A కింద గృహ హింస కేసు పెట్టింది.
ఇది కూడా చూడండి: బన్నీకి బెయిల్ ఇచ్చిన లాయర్ ఎవరు? వామ్మో గంటకు ఇంత ఫీజు హా?
పిల్లి చేసిన పెంట.. దంతులు మధ్య చిచ్చు
పిల్లికి ఇచ్చిన విలువ కూడా తనకు ఇవ్వడం లేదని, ఆ పిల్లిపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలు తనకు అందండం లేదు. ఈ పిల్లి లొల్లి వల్ల ఇద్దరి మధ్య రోజూ వివాదాలు జరుగుతున్నాయని భార్య ఆరోపించింది. దీనికి తోడు పిల్లి కూడా తనపై దాడి చేస్తుందని, దీనివల్ల వివాదం ఇంకా పెరుగుతుందని తెలిపింది. దీనిపై విచారించిన కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
కేవలం వరకట్నం కోసం పిల్లిపై ప్రేమ చూపిస్తున్నాడనే కారణంతో ఈ సెక్షన్‌పై కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదు. పిల్లిపై ప్రేమ చూపిస్తున్నాడనే భార్య చేసిన ఆరోపణలకు, కేసు పెట్టిన సెక్షన్లకు ఎలాంటి సంబంధం లేదని హైకోర్టు జడ్జి తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని కోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో భర్తకు మధ్యంతర రక్షణ కల్పించారు. ఇలాంటి చిన్న కారణాలకు భర్తలపై ఫిర్యాదు చేసి వరకట్నం కోరడం కరెక్ట్ కాదని కోర్టు తీర్పునిచ్చింది.
ఇది కూడా చూడండి: Kavya Kalyanram: ఆహా.. పిచ్చెక్కించే ‘బలగం’ బ్యూటీ అందాలు..
ఇది కూడా చూడండి: Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన