/rtv/media/media_files/yTkQiV8pHFJ5MAlY4cCY.jpg)
AP: ఏపీ వాసులకు ముఖ్య గమనిక. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ ఆవర్తనం ఆదివారానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనంగా మారిన తర్వాత.. 48 గంటల్లో పశ్చిమ, వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు.
Also Read: KTR: ఇది కచ్చితంగా అభద్రతా భావమే..బన్నీ అరెస్ట్‌పై కేటీఆర్
దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో.. మంగళవారం అంటే డిసెంబర్ 17న.. కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Also Read: ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్..!
మరోవైపు బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన రెండు అల్పపీడనాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫెంగల్ తుపాను కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ తుపాను ప్రభావం తగ్గిన తర్వాత.. మరో అల్పపీడనం ఏర్పడినట్లు సమాచారం.
Also Read:Rahul Gandhi:సావర్కార్‌పై వ్యాఖ్యలు..రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కారణంగా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షం కురిసింది. దీంతో పంటలు కూడా దెబ్బతిన్నాయి. తిరుపతి, తిరుమలలో కురిసిన భారీ వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read: Karnataka: కన్నడ నటులు దర్శన్, పవిత్ర గౌడ్‌లకు బెయిల్
అయితే ఈ అల్పపీడనం ఎఫెక్ట్ తగ్గిందని అనేలోపు..మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 15 నాటికి ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా బలపడుతుందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
పంజా విసురుతున్న చలిపులి
తెలంగాణలో గత కొద్ది రోజులుగా చలితీవ్రత పెరిగిపోయింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పన్నెండు గంటల వరకూ సూర్యుడు బయటకు కనిపించడం లేదు. ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
పొగమంచు కారణంగా రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్ - విజయవాడ, హైదరాబాద్ - వరంగల్, హైదరాబాద్ - ముంబయి జాతీయ రహదారులపై వాహనాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని భావించి పన్నెండుగంటలవరకూ హెడ్ లైట్లు వేసుకుని మరీ వాహనాలను నడుపుతున్నారు.
దీంతో పాటు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. వచ్చే రోజుల్లో మరింతగా చలి పెరిగే అవకాశముందనివాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. చలి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు.
దీర్ఘకాలికవ్యాధులున్న వారు చలిలో బయటకు రావద్దని వైద్యులు అంటున్నారు.గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు మార్నింగ్ వాక్ చేయకపోవడమే మంచిదని, వాకింగ్ చేయదలచుకుంటే పది గంటల తర్వాత మాత్రమే చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధులతో అనేక మంది ఆసుపత్రిలో చేరుతున్నారు.