/rtv/media/media_files/2025/02/03/psFcKw6xv7x5m32dZwAA.jpg)
maoist in karnataka Photograph: (maoist in karnataka)
కర్ణాటక రాష్ట్రంలోని మావోయిస్ట్ నేత లక్ష్మీ ఆదివారం పోలీసులకు లొంగిపోయింది. కర్ణాటక చివరి నక్సలైట్ బేషరతుగా సరెండర్ అయ్యారని ఉడిపి డిప్యూటీ కమిషనర్ విద్యా కుమారి, ఎస్పీ అరుణ్ కె మీడియాకు తెలిపారు. దీంతో కర్ణాటక రాష్ట్రం నక్సలైట్ లేని ప్రాంతమని వారు ప్రకటించారు. ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకాలోని అమాసెబైల్, శంకరనారాయణ పోలీస్ స్టేషన్లలో లక్ష్మిపై మూడు కేసులు ఉన్నాయి. సరెండర్ అయిన తర్వాత ఆమెపై ఉన్న కేసులను కొట్టివేయాలని పోలీస్ ఆఫీసర్లను కోరింది.
Read also : Ap -Prakasam: పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి మిస్సింగ్.. తీరా చూస్తే ట్విస్ట్ అదిరిందిగా..!g
రాష్ట్ర సరెండర్ కమిటీ శ్రీపాల్ హాజరైన విలేకరులతో అన్నారు. కమిటీ కృషి వల్ల 2025లో ఇప్పటి వరకు 22 మంది నక్సల్ కార్యకర్తలు లొంగిపోయారని, రాష్ట్రంలో లొంగిపోయిన చివరి వ్యక్తి లక్ష్మీ అని అన్నారు. కర్ణాటక ఇప్పుడు నక్సల్ రహిత రాష్ట్రంగా అవతరించింది. లక్ష్మీ భర్త సలీం 2020లోనే ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు ముందు సరెండర్ అయ్యారు.
Read also: ఢిల్లీలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ
లొంగిపోయినందుకు లక్ష్మీకి రూ.7 లక్షల సరెండర్ ప్యాకేజీ గవర్నమెంట్ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నక్సల్స్‌కు 'ఎ' కేటగిరీ డినామినేట్ చేయబడింది. సరెండర్ అయిన మావోయిస్టులకు వారి సామర్థ్యాన్ని బట్టి విద్య, పునరావాసం, ఉపాధి వంటి సౌకర్యాలు అందించబడతాయని డిసి కుమారి చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్లపై నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, సమాజంలో సాధారణ జీవనం సాగించేందుకు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని రాష్ట్ర సరెండర్ కమిటీ శ్రీపాల్ అన్నారు.