/rtv/media/media_files/2025/12/31/newyear-2025-12-31-15-03-05.jpg)
2025కు వీడ్కోలు చెబుతూ, సరికొత్త ఆశలతో 2026కి స్వాగతం పలికేందుకు ప్రపంచం సిద్ధమైంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఎప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు 'హ్యాపీ న్యూ ఇయర్' అని చెప్పుకుందామా అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో ఉండే కాల మండలాలు కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏడాది ఒకేసారి రాదు.
ఫస్ట్ న్యూయర్ కిరిబాటి
ప్రపంచంలో అందరికంటే ముందుగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేది పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవి. ఇండియన్ స్టాండర్ట్ టైం ప్రకారం డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30 గంటలకే ఇక్కడ ప్రజలు 2026లోకి అడుగుపెట్టేస్తారు. అంతర్జాతీయ తేదీ రేఖకు అత్యంత సమీపంలో ఉండటమే దీనికి కారణం. కిరిబాటి తర్వాత న్యూజిలాండ్ వంతు వస్తుంది. ఇక్కడ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు వేడుకలు మొదలవుతాయి. ఆక్లాండ్‌లోని స్కై టవర్ వద్ద జరిగే బాణసంచా ప్రదర్శనతో న్యూజిలాండ్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది.
Here is the country that celebrates the New Year first. pic.twitter.com/gUHg7L5Z5s
— Defiant L’s (@DefiantLs) December 30, 2024
ఆస్ట్రేలియా నుంచి ఆసియా దాకా..
న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోతుంది. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద జరిగే అద్భుతమైన వెలుగుల విందు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రమంగా ఆసియా దేశాలకు కొత్త ఏడాది విస్తరిస్తుంది:
రాత్రి 8:30 గంటలకు: జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా.
రాత్రి 9:30 గంటలకు: చైనా, మలేసియా, సింగపూర్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్.
రాత్రి 10:30 గంటలకు: థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియా.
భారత్‌తో పాటు మరో 43 దేశాలు
మరోవైపు, భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు మనం పండుగ చేసుకుంటుండగా, మనతో పాటే మరో 43 దేశాలు 2026లోకి అడుగుపెడతాయి. ఇందులో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ వంటి యూరోపియన్ దేశాలతో పాటు ఆఫ్రికా ఖండంలోని కాంగో, అంగోలా, కామెరూన్ వంటి దేశాలు ఉన్నాయి.
చివరిగా అమెరికా దీవులు
ప్రపంచమంతా పండుగ జరుపుకున్న తర్వాత, అందరికంటే చివరగాఅమెరికాలోని కొన్ని ప్రాంతాలు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. ముఖ్యంగా అమెరికన్ సమోవా, బేకర్ ఐలాండ్ వంటి ప్రాంతాలు జనవరి 1వ తేదీ సాయంత్రం వరకు కూడా 2025లోనే ఉంటాయి. ఇలా కిరిబాటిలో మొదలైన నూతన సంవత్సర ప్రయాణం దాదాపు 26 గంటల పాటు సాగి అమెరికా దీవులతో ముగుస్తుంది.
Follow Us