అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించిన కమల్‌ హాసన్..

అంబేద్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందించారు. అంబేద్కర్‌ ఆలోచనలతోనే భారతదేశం నిర్మితమైందని పేర్కొన్నారు. ప్రతీ భారతీయుడు అంబేద్కర్ దృక్పథాన్ని నమ్ముతున్నాడని అన్నారు. ఆయన వారసత్వాన్ని లేకుండా చేయాలని చూస్తే ఎవరూ కూడా సహించరన్నారు.

New Update
kamal hassan

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయమ్ పార్టీ (MNM) నేత కమల్ హాసన్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. అంబేద్కర్‌ ఆలోచనలతోనే భారతదేశం నిర్మితమైందని పేర్కొన్నారు. '' గాంధీజీ విదేశీయుల అణిచివేత నుంచి భారతదేశానికి విముక్తి కల్పించారు. కానీ అంబేద్కర్ దేశంలో సామాజిక అన్యాయాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించారు.    

Also Read: నాతో రాహుల్ గాంధీ అసభ్యంగా ప్రవర్తించారు.. మహిళా ఎంపీ ఆరోపణలు!

ప్రతీ భారతీయుడు అంబేద్కర్ దృక్పథాన్ని నమ్ముతున్నాడు. దీనిపై ప్రతిఒక్కరూ కూడా పోరాడతారు. అలాంటి మహానీయుడి వారసత్వాన్ని లేకుండా చేయాలని చూస్తే ఎవరూ కూడా సహించరు. మన రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లైన సందర్భంగా పార్లమెంటులో అర్థవంతంగా చర్చలు జరగాలి. అలాగే అంబేద్కర్ ఆలోచనలను కూడా చర్చించుకోవాలని'' కమల హాసన్ అన్నారు. 

Also Read: అమిత్‌ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం

అలాగే మరో తమిళ నటుడు, తమిళగ వెట్రీ కళగం(TVK) పార్టీ అధినేత విజయ్ కూడా స్పందించారు. '' కొంతమందికి అంబేద్కర్‌ పేరు వినడం నచ్చదు. ఆయన భారత పౌరులందరికీ స్వాతంత్ర్య స్పూర్తినిచ్చిన రాజకీయ మేధావి. దేశంలో అట్టడుగు వర్గాలకు ఆయన ఒక ఆశాజ్యోతి. సామాజిక న్యాయానికి ఆయనొక ప్రతీక. అంబేద్కర్, అంబేడ్కర్‌, అంబేద్కర్ అని పేరు ఆయన పేరు అంటే పెదవులకు, మనసుకు సంతోషంగా ఉంటుందని'' విజయ్ అన్నారు.     

Also Read: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు

Also Read: అంబేడ్కర్ Vs దేవుడు.. అమిత్‌షాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు