/rtv/media/media_files/2025/05/25/gdHCpjVYa4z34k8aZVz8.jpg)
Jyoti Malhotra Meet Rahul Gandhi?
Rahul Gandhi : పాకిస్తాన్ కు దేశ రహస్యాలు చేరవేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హొత్రా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురు నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ''గూఢచర్యం చేస్తూ పట్టుబడిన హర్యానాకు చెందిన చెందిన యూబ్యూటర్ జ్యోతితో రాహుల్ ఉన్నారు. ప్రతి ద్రోహి, జాతివ్యతిరేక శక్తి రాహుల్‌తో కనిపిస్తుండం చాలా స్ట్రేంజ్. దేశానికి ఎదురవుతున్న కల్లోలాల వెనుక రాహుల్ ఉన్నారా?'' అని ఓ నెజియన్ సూటిగా ప్రశ్నించారు. ప్రశ్న వేశారు. అయితే జ్యోతి మల్హొత్రా నిజంగా రాహుల్ ను కలిశారా? ఆయనతో పోటో దిగారా? అసలు ఈ ఫోటో వెనుక నిజం ఎంత? ఈ ఫోటో ఎప్పుడు తీశారు. ఇందులో మార్ఫింగ్ వ్యవహారం ఏదైనా ఉందా అనే విషయాలు ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
Also Read: కేరళ తీరంలో మునిగిపోయిన భారీ షిప్.. 24 మంది సిబ్బంది
నిజానికి ఈ ఫోటో పూర్తిగా మార్ఫింగ్ ఫోటో అని తేలింది. పలు ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీలు రాహుల్, జ్యోతి మల్హోత్రా ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఫోటోలుగా డిక్లేర్ చేసాయి. గూగుల్ ఇమేజ్ సెర్చ్ వివరాల ప్రకారం, పలు మీడియా సంస్థలు 2017 నాటి ఒరిజనల్ ఫోటోను ప్రచురించాయి. మార్ఫ్‌డ్ ఫోటో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు రాహుల్‌తో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ మాజీ నాయకురాలు అదితి సింగ్ అని తేలింది. జ్యోతిమల్హోత్రా ఏదైతే చీర కట్టుకుని వైరల్ ఫోటోల్లో ప్రస్తుతం కనిపిస్తోందో అదే చీరలో అదితి సింగ్ ఉన్నారు. అంతేకాదు పూర్తిగా అదే ఫోజులో కూడా కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న వ్యక్తి కూడా మారలేదు. అదితి సింగ్‌తో రాహుల్ ఫోటో ఏళ్ల క్రితం నాటిది. ఆమె 2017లో ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదితిసింగ్ రాయబరేలికి చెందిన కాంగ్రెస్ మాజీ నాయకురాలు. 2021లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె రాయబరేలి సదర్ నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పుడు రాహుల్ తో తీసుకున్న ఫోటోను కొంతమంది మార్ఫింగ్ చేసి వైరల్ చేసినట్లు తేలింది.
Also Read: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. RDXతో పేల్చేస్తామన్న దుండగులు
పాకిస్తాన్‌తో గూఢచర్యం నడుపుతున్నారనే ఆరోపణలపై జ్యోతి మల్హోత్రా గత నెలలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ హెకమిషన్ స్టాఫర్ డేనిష్‌తో 2023 నవంబర్ నుంచి జ్యోతి టచ్ లో ఉన్నట్లు తేలింది. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నారనే ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేశారు. గుఢచర్యానికి పాల్పడుతున్న ఆరోపణలపై డేనిష్‌ను మే 13న ఇండియా నుంచి బహిష్కరించారు. జ్యోతి మల్హోత్రా గుఢచర్యం వ్యవహారంపై ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నారు. త్వరలోనే ఆమెనుంచి పూర్తి వివరాలు నాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ మరో బాంబ్.. వాళ్ల వివరాలు కావాలని డిమాండ్
Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే
Fact Check: Viral Photos of YouTuber Jyoti Malhotra with Rahul Gandhi Are Fake and Morphedhttps://t.co/MZ4I1GRJA8 pic.twitter.com/iIIkFYmyMC
— DFRAC Official (@dfrac_official) May 22, 2025