/rtv/media/media_files/2025/07/21/justice-yashwant-varma-2025-07-21-20-26-46.jpg)
అవినీతికి పాల్పడిన అలహాబాద్ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మపై అభింశసన తీర్మాణం వేటు పడనుంది. ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరికిన వీడియోలు వైరలైన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న సమయంలో మార్చి 14న అతని ఇంటిలో రూ.500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాంతో, ఆయనపై చర్యలకు ఆదేశించిన సుప్రీంకోర్టు.. ఇన్‌హౌజ్ కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం పార్లమెంట్ సమావేశంలో ఆయనపై అభింశసన తీర్మానాన్ని పెట్టారు పలువురు ఎంపీలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజునే పార్టీలకతీతంగా ఇరు సభల్లోని 200ల మంది మోషన్‌పై సంతకాలు చేశారు. అనంతరం ఆ పత్రాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.
Also Read : Urfi Javed Lip Fillers Video: బిగ్ బాస్ బ్యూటీకి బెడిసికొట్టిన సర్జరీ!.. షాకింగ్ వీడియో
Also Read : Coconut Water And Diabetes: డయాబెటిస్ రోగులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా..? తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు
Justice Yashwant Varma Impeach In Parliament
రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 218 కింద జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టారు. ఈ మోషన్‌కు బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ ఎంపీలతో పాటు సీపీఎం సభ్యులు కూడా మద్దతు తెలిపారు. అభిశంసన తీర్మానంపై సంతకాలు చేసిన వాళ్లలో రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీ, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఎగువ సభలోనూ జస్టిస్ వర్మను తొలగించాలని తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు ఎంపీలు. 50 మంది ఆయనను తొలగించాలని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌ను కోరారు.
Also Read : కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన!
Also Read : Justice Yashwant Varma: ఆ న్యాయమూర్తిని తొలగించడానికి.. 200 మంది MPలు సంతకాలు
latest-telugu-news | mps | parliament | impeachment | Justice Yashwant Varma