Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన!

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌. ఈ నెల25నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

New Update
Telangana Ration Cards

Telangana Ration Cards

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌ న్యూస్‌. ఈ నెల25 నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో కురుస్తున్న వర్షాలు, వైరల్‌ ఫీవర్స్‌,ఎరువులు, రేషన్‌ కార్డలు పంపిణీ, పంటల సాగు తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. 

Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

Revanth Reddy Announcement On New Ration Cards

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి అన్ని మండల కేంద్రాల్లో రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలని  ఆగస్టు 10 వరకు నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు విధిగా పాల్గొనాలని ఆదేశించారు.  అలాగే రేషన్‌ కార్డులు రానివారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, మూడు కోట్ల 10 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తున్న రాష్ర్టం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రేషన్ కార్డు విలువ పెరిగిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Also Read : షాకింగ్ వీడియో.. ట్రైన్ బ్రిడ్జ్‌పై ఉండగా కూలిపోయిన పునాది - వందలమంది ప్రాణాలు!

దీనితో పాటు రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, రైతులకు ఎరువులు దొరకడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు ఎక్కడా క్యూలైన్లలో ఉండటం లేదని స్పష్టం చేశారు. ఎరువుల స్టాక్‎పై ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డులు ఉండాలని అధికారులను సూచించారు. రైతులకు ఎలాంటి కొరత లేకుండా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాల్లో ఎన్ని ఎరువుల దుకాణాలు ఉన్నయనేది కలెక్టర్ దగ్గర లిస్ట్ ఉండాలని కోరారు. ఎరువుల కొరత ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

Also Read :  కాలిన గాయాలపై టూత్‌పేస్ట్ రాస్తున్నారా..? డాక్టర్ చెప్పే విషయాలు తెలుసుకోండి

cm-revanthreddy | ration cards distribution in telangana | new ration cards updates in telangana | New Ration Cards Telangana | new ration cards in telangana | new ration cards rules | ration-cards

Advertisment
Advertisment
తాజా కథనాలు