/rtv/media/media_files/2024/12/01/yW2ZGJKjvXwFGvRrh5pV.jpeg)
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమితో తాము పొత్తుకు సిద్ధంగా లేనని పేర్కొంది. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తులకు దూరంగా ఉంటుందని.. ఒంటరి పోరుకు సిద్ధమవుతోందని మీడియా సమావేశంలో తెలిపారు.
Also Read: తుపాను ఎఫెక్ట్, విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం.. చివరికి
ఆప్ అధినేత చేసిన ప్రకటన వల్ల ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిరాకరించిన సంగతి తెలిసిందే. 13 స్థానాల్లో ఒంటరిగా పోటీలోకి దిగింది. మరోవైపు.. ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా పోటీ చేస్తామని కాంగ్రెస్ కూడా ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాము ఒంటరిగా వెళ్తామని చెప్పింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌పై దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై కేజ్రీవాల్ స్పందించారు.
Also Read: హైబ్రిడ్ మోడల్‌కు పాక్ గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండిషన్.. ఏంటంటే?
'' అసలు నేను ఏం తప్పు చేశాను. ఢిల్లీ శాంతిభద్రతల అంశాన్ని లేవనెత్తాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని అనుకున్నాను. కానీ ఇలా జరగకుండా పాదయాత్రలో నాపై దాడి జరిగింది. ఓ వ్యక్తి నాపై ద్రావకం విసిరాడు. ఇది ప్రమాదకరం కాదు. కానీ మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని'' అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Also Read: తుపాను ఎఫెక్ట్, విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం.. చివరికి
Also Read: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. పుదుచ్చేరిలో వరదలు