Pak: హైబ్రిడ్ మోడల్‌కు పాక్ గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండిషన్.. ఏంటంటే?

ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడానికి పాక్ అంగీకరించింది. కానీ భవిష్యత్తులో తమ జట్టు ఐసీసీ టోర్నీల కోసం ఇండియాకు వెళ్లకూడదనే కండిషన్‌ పెట్టింది. ఇరు జట్లుకు సమాప గౌరవం దక్కాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వి తెలిపారు

New Update
Champions Trophy

ఛాంపియనస్ ట్రోఫీ 2025ని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. అయితే దీనికి ఒప్పుకోవడంతో పాటు ఒక కండిషన్ పెట్టింది. పాక్‌లో జరిగే మ్యాచ్‌లకు రావడానికి భారత్ ఒప్పుకోవట్లేదు. అలాగే పాక్ జట్టు కూడా భవిష్యత్తులో ఐసీసీ టోర్నీల కోసం ఇండియాకు వెళ్లకూడదని కండిషన్‌కి పెట్టింది.  

రెండు జట్లుకు ప్రయోజనం చేకూరేలా..

భారత్ విధానాలను ఐసీసీకి చెప్పినట్లే మా నిర్ణయాలను చెబుతున్నాం. ఏం చేసిన కూడా రెండు దేశాలకు, క్రికెట్ జట్లుకు ప్రయోజనం చేకూరేలా ఉండాలి. అందరి గౌరవం దక్కాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వి తెలిపారు. ఎలాంటి నిర్ణయం అయిన ఇరు జట్లకు సమానంగా ఉండాలి. భారత్ జట్టు మా దేశానికి రాదు.. కానీ పాక్ జట్టు అక్కడికి వెళ్లాలంటే కుదరదని మోసిన్ తెలిపారు. 

ఇది కూడా చూడండి: ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..?

వచ్చే ఏడాది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల దాడుల వల్ల టీమిండియా జట్టు రాదని, బీసీసీఐ ఐసీసీకి చెప్పింది. హైబ్రిడ్ మోడల్‌లో ఈ ట్రోఫీని నిర్వహించాలని కోరగా.. పాక్ దీనికి నిరాకరించింది. దీనికి ఒప్పుకోకపోతే టోర్నీని వేరే దేశానికి తరలిస్తామని చెప్పడంతో పాక్ కండిషన్‌తో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చూడండి: Adani: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ

ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..

ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

Advertisment
Advertisment
తాజా కథనాలు