ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. పుదుచ్చేరిలో వరదలు

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. జనావాసాలు నీటమునిగాయి. విల్లుపురం జిల్లాలో 50 సెం.మీ, కడలూరులో 18 సెం.మీ, మరకానాలో 23.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.

New Update
Pandichery

 కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. జనావాసాలు నీటమునిగాయి. ఫెంగాల్ తుఫాను పుదచ్చేరికి సమీపించిన అనంతరం అక్కడ 47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విల్లుపురం జిల్లాలో 50 సెం.మీ, కడలూరులో 18 సెం.మీ, మరకానాలో 23.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఫెంగాల్‌ తుఫాను గత రాత్రి తీరం దాటినప్పటికీ కూడా మారకానాలా ఇప్పటికీ బలమైన గాలులు వీస్తున్నాయి.  

Also Read: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌.. ఇద్దరు హిందూ పూజారులు అరెస్టు

ఇప్పటికే పుదుచ్చేరిలో జనజీవనం స్తంభించింది. మామల్లపురం పరిసర ప్రాంతాల్లో వర్షం ఇంకా కురుస్తోంది. గాలి వేగం ఎక్కువగా ఉండటం వల్ల విద్యుత్‌ సరఫరా కాలేదు. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తీరం దాటింది. గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో గాలులు వీయడం వల్ల పలుచోట్లు చెట్లు నేలకూలాయి. ఈ నేపథ్యంలోనే పుదుచ్చేరి, అలాగే తమిళనాడులో 6 జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్డ్ జారీ చేసింది. 

Also Read: ఆప్ ఎమ్మెల్యేకు షాక్.. అపవిత్రం కేసులో రెండేళ్లు జైలు శిక్ష

ఇదిలాఉండగా.. పెంగాల్ తుపాను తీరం దాటాకా కూడా చెన్నై, తిరువళ్లూరు, కారైకాల్‌తో పాటు 22 జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బెంగాల్‌లో తుఫాను కారణంగా ఏర్పడ్డ మేఘాల వల్ల తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురవనున్నాయి. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు,తంజావురు, నాగపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

Also Read: రూ. 295 కోసం ఏడేళ్ల పోరాటం..చివరికి ఏమైందంటే!

Also Read: హైబ్రిడ్ మోడల్‌కు పాక్ గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండిషన్.. ఏంటంటే?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు