JEE Main 2026 : జేఈఈ (మెయిన్‌) పరీక్ష తేదీల ఖరారు..ఎవరి ఎగ్జామ్‌ ఎక్కడో తెలియాలంటే?

జేఈఈ మెయిన్‌  పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఎన్‌టీఏ ప్రకటించింది. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్‌ పేపర్‌ -1 పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)  స్పష్టం చేసింది. ఇప్పటికే  సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేసింది.

New Update
FotoJet (98)

JEE Main 2026

JEE Main 2026 : జేఈఈ మెయిన్‌  పరీక్ష తేదీలు(jee-main-exam-dates) ఖరారయ్యాయి. ఈ మేరకు ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్వాన్స్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను సైతం విడుదల చేసింది. కాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 సెషన్-1 కు సంబంధించి ఇప్పటికే  సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేసింది. అభ్యర్థులు jeemain.nta.nic.in ద్వారా తమ పరీక్ష ఏ నగరంలో పడిందో తెలుసుకునే అవకాశం కల్పించింది. పరీక్ష నగరాన్ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా సమయానికి కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంటుంది. 2026 జనవరి 21వ తేదీ నుంచి 29 వరకు షిఫ్టుల వారిగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్టీఏ జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించనుంది.

పరీక్షలకు సంబంధించి మీ ఎగ్జామ్‌ సెంటర్‌ ఏ నగరంలో ఉందో తెలుసుకొనేలా JEE Mains City Intimation Slip 2026ను ఎన్‌టీఏ ఈ రోజు (గురువారం) అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

Also Read :  జనగణన తొలిదశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..నోటిఫికేషన్ జారీ

పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

కాగా, జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్‌ పేపర్‌ -1 పరీక్షలు(JEE Main 2026 exam) జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)  స్పష్టం చేసింది. జనవరి 29న పేపర్‌ 2ఎ (బీఆర్క్‌) పేపర్‌ 2బి (బి.ప్లానింగ్‌), పేపర్‌ 2ఎ, 2బి (బీఆర్క్‌, బి.ప్లానింగ్‌ రెండూ కలిపి) ఒకే షిఫ్టులో జరగనున్నాయి. ఈ పరీక్ష ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరుగుతుందని ఎన్‌టీఏ పేర్కొంది. జేఈఈ మెయిన్ సెషన్‌- 1 పరీక్షలు కేవలం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోనే కాకుండా, విదేశాల్లోని 15 నగరాల్లోనూ  నిర్వహించనున్నట్లు ఎన్టీఏ డైరెక్టర్‌ (ఎగ్జామ్స్‌) తెలిపారు. దీనికి గాను ఇంటిమేషన్‌ స్లిప్‌లు విడుదల చేశామన్నారు. ఎగ్జామ్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు 011-40759000 నంబర్‌కు లేదా [email protected] ద్వారా సంప్రదించవచ్చని వెల్లడించారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకొనేందుకు తమ అధికారిక వెబ్‌సైట్‌ని చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Also Read :  దారుణం.. రూ.3 లక్షలకు గిరిజన యువతి అమ్మకం

Advertisment
తాజా కథనాలు