/rtv/media/media_files/2026/01/08/palghar-tribal-woman-2026-01-08-14-05-35.jpg)
Palghar tribal woman 'sold' for Rs 3 lakh under marriage pretext, 4 booked
మహారాష్ట్ర(maharashtra) లోని పాల్ఘర్ జిల్లాలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ 20 ఏళ్ల గిరిజన యువతి(Palghar Tribal Woman) ని రూ.3 లక్షలకు అమ్మారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. నాసిక్‌కు చెందిన ఓ వ్యక్తి, తన తల్లితో కలిసి మధ్యవర్తులకు ఈ డబ్బును చెల్లించారు. కట్కరీ తెగకు చెందిన ఈ యువతిని 2024 మే నెలలో ఆ వ్యక్తి బలవంతంగా వివాహం చేసుకున్నాడు.
Also Read: ట్రంప్ కీలక ప్రకటన.. అమెరికా నుంచి సాయం పొందుతున్న 120 దేశాల లిస్టు విడుదల
Palghar Tribal Woman Sold For Rs 3 Lakh
పెళ్లి తర్వాత అతడు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా తనపై భర్త దాడులు చేశాడని, సరిగ్గా భోజనం పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బిడ్డ పుట్టాక గతేడాది జూన్‌లో ఆమె తన పుట్టింటికి వెళ్లింది. చివరికి ఈ నెల 6వ తేదీన నిందితులు బిడ్డను తీసుకెళ్లేందుకు యత్నించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో పోలీసులు ఆమె భర్త, అత్త అలాగే ఇద్దరు మధ్యవర్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ప్రపంచ రాజకీయాలను మార్చుతున్న కనిపించని శక్తులు.. తెర వెనుక మాస్టర్ మైండ్స్ వీరే!
Follow Us