BANK JOBS: బ్యాంక్ ఉద్యోగ అభ్యర్థులకు బిగ్ షాక్.. నియామకాల్లో భారీ మార్పులు!

ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించిన పరీక్షల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ పలు మార్పులను సూచించింది. మొదట ఎస్‌బీఐ, అనంతరం ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఆ తరువాత చివరగా ఆర్‌ఆర్‌బీలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించాలి. 

New Update
bank jobs

బ్యాంకు పరీక్షలు అంటే ఆర్ఆర్బీ. ఇది అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఎస్‌బీఐలలో ఉద్యోగాల పరీక్షల కంటే ముందే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు అంటే ఆర్‌ఆర్‌బీలకు నియామక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్‌బీఐ తానే స్వంతంగా ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ చేపడుతుండగా ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఆర్ఆర్‌బీలలో రిక్రూట్‌మెంట్‌ను ఆయా బ్యాంకుల ఆదేశాలకు అనుగుణంగా ఐబీపీఎస్ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఇందులో పాస్ అయితే గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు వస్తాయి. అక్కడ నుంచి ఇతర ప్రభుత్వ బ్యాంకులకు, తరువాత ఎస్‌బీఐకి  మారుతారు. ఈ వలస బ్యాంకులలో గణనీయమైన అట్రిషన్ కు దారితీస్తూ కార్యాచరణ సవాళ్లను విసురుతోందని ఆర్థిక వాఖ భావించింది. దీనికి సంబంధించి బ్యాంకు పరీక్షలు, రిక్రూట్ మెంట్ల సమగ్ర ప్రక్రియ, ఫలితాల ప్రకటనపై సమీక్షించింది. మూడు రకాల బ్యాంకులలో నియామక ఫలితాలను ప్రకటించడానికి ప్రామాణిక, తార్కిక క్రమాన్ని అమలు చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కు సూచించింది.

పెద్ద బ్యాంకుల నుంచి చిన్న బ్యాంకులు

దీనిబట్టి ఆర్థిక శాఖ ఫలితాల ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేసింది. మొదట ఎస్బీఐ తర్వాత ఇతర బ్యాంకులు...చివర్లో ఆర్ఆర్బీ కు సంబంధించి ఫలితాలను ప్రకటించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ కేటగిరీలలోని అన్ని ఆఫీసర్ స్థాయి పరీక్షల ఫలితాలను ప్రారంభంలో ప్రకటిస్తామని, క్లరికల్ స్థాయి పరీక్ష ఫలితాలను అదే క్రమంలో ప్రకటిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం ప్రకటించింది.  

Advertisment
తాజా కథనాలు