/rtv/media/media_files/2025/08/10/navodaya-schools-2025-08-10-16-24-47.jpg)
Navodaya Schools
జవహర్ నవోదయ విద్యాలయాల్లో(JNV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు మరో 3 రోజుల్లో ముగియనుంది. ఇటీవల దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 13 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దరఖాస్తుకు ఇంకా మూడు రోజులే సమయం ఉండటంతో అర్హులైన విద్యార్థులు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలాఉండగా జూన్ 1 నవోదయ విద్యాలయల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 29 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరించారు. అయితే విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తు గడువు ఆగస్టు 13 వరకు పొడిగించారు.
Also Read: తీసుకున్న సొంత గొయ్యిలో పడ్డ పాకిస్తాన్.. 2 నెలల్లో రూ.1,240 కోట్లు నష్టం
దేశంలో 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకై సీట్ల భర్తీ కోసం రెండు విడుతల్లో పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో డిసెంబర్ 13న ఈ పరీక్ష జరగనుంది. జమ్మూకశ్మీర్‌తో పాటు పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 11న నిర్వహించనున్నారు.
ఎలా ఎంపిక చేస్తారు ?
JNVలో సీటు వచ్చిన విద్యార్థులకు 6వ తరగతి నుంచి ఇంటర్నీడియట్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. అక్కడ చదువుతో పాటు ఆటలు, సమగ్ర వికాసానికి అధిక ప్రాధాన్యమిస్తారు. దేశంలో మొత్తం 654 నవోదయ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 15 స్కూల్క్ ఉన్నాయి. ఒక JNV స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశానికి 80 మంది విద్యార్థులకు అవకాశం లభిస్తుంది. విద్యార్థులు ఒకసారి మాత్రమే ఈ పరీక్ష రాయాలి. ఇందులో 75 శాతం సీట్ల కోటా గ్రామీణ ప్రాంత విద్యార్థులకే ఉంటుంది. ఇక మిగతా 25 శాతం మిగతా వారికి ఉంటుంది.
గ్రామీణ కోటాలో సీటు కోరుకునే స్టూడెంట్స్ 3,4,5 తరగతులు పూర్తిగా గ్రామీణ ప్రాంతంలోనే ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుకోవాలి. ఈ మొత్తం సీట్లలో మూడోవంతు బాలికలు ఉంటాయి. ఎస్సీలకు 15 శాతం, ఏస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఇక ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు కొన్ని సీట్లు కేటాయించారు. సీటు పొందిన బాలబాలికలకు విడిగా వసతి ఉంటుంది.
Also Read: అమెరికా పతనం మొదలైంది..సుంకాల తర్వాత వాల్ మార్ట్ లో ధరల పెరుగుదల
పరీక్ష విధానం
ఈ పరీక్షలో మొత్తం ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షకు 100 మార్కులు ఉంటాయి. మూడు సెక్షన్ నుంచి 8-0 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. వీటిని రెండు గంటల్లో రాయాలి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ ఉండవు. సమాధానం గుర్తించేందుకు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను వినియోగించాలి. మరో విషయం ఏంటంటే ఈ నవోదయ విద్యాలయాల్లో సీటు పొందిన విద్యార్థులకు ఐఐటీ జేఈఈ, నీట్ వంటి జాతీయ పోటీ పరీక్షల్లో కూడా రాణించేలా శిక్షణ ఇస్తారు.
Also Read: విమానంలో ప్రయాణికురాలికి 'డర్టీ' సీటు.. ఇండిగో సంస్థకు భారీ జరిమానా