/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/EARTHQUAKE-jpg.webp)
Earth Quake
J&K Ladakh Earthquake Today: జమ్మూకశ్మీర్ లడఖ్‌లోని లేహ్‌లో అర్థరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అలాగే నేడు నేపాల్‌లో కూడా 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇది కూడా చూడండి: Cherry Tomatoes: చెర్రీ టమోటాల గురించి విన్నారా? ఈ 5 అద్భుతమైన ప్రయోజనాల తప్పక తెలుసుకోండి!
EQ of M: 3.5, On: 21/05/2025 23:46:59 IST, Lat: 34.54 N, Long: 78.38 E, Depth: 10 Km, Location: Leh, Ladakh.
— National Center for Seismology (@NCS_Earthquake) May 21, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/etY5pbgyNq
ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా
జార్జియా దేశంలో కూడా..
ఇదిలా ఉండగా జార్జియా దేశంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైందని అమెరికా భూకంప కేంద్రం తెలిపింది. ఆకస్మిక ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంప ప్రభావంతో పలు ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.
ఇది కూడా చూడండి: భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?
ఆగ్నేయ ఐరోపా దేశం గ్రీస్ లో భారీ మరోసారి భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్(German Research Center for Geosciences) తెలిపింది. భూ అంతర్భాగంలో 77 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. వారం రోజుల ముందే గ్రీస్‌లో భూకంపం సంభవించింది. తిరిగి బుధవారం తెల్లవారుజామున 1.51 గంటలకు (ఈస్టర్న్ యూరోపియన్ టైమ్) ప్రకారం గ్రీస్‌లోని కాసోస్ దీవి సమీపంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంప కేంద్రంఫ్రై, గ్రీస్‌కు ఆగ్నేయంగా 14 మైళ్ల దూరంలో 62.5 కి.మీ లోతులో సంభవించినట్లుగా పేర్కొంది.
ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!