Salumara Timmakka: 114 ఏళ్ల ‘వృక్షమాత’ సాలుమరద తిమ్మక్క మృతి.. పవన్ ఎమోషనల్

కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

New Update
Saalumarada Thimmakka died

Saalumarada Thimmakka died

కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క(Salumara Timmakka) 114 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ బెంగళూరులోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(ap-deputy-cm-pawan-kalyan), కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య సంతాపం వ్యక్తం చేశారు. 

పవన్ కళ్యాణ్ సంతాపం

సాలుమరద తిమ్మక్క మృతిపై పవన్ కళ్యాణ్ సీఎంఓ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. ‘‘ ప్రకృతి పట్ల బేషరతు ప్రేమను ప్రతిబింబించే మన ప్రియమైన వృక్షాల తల్లి పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క మరణం చాలా బాధాకరం. ఆమె జీవితం తల్లి ప్రేమతో వందలాది చెట్లను పోషించింది. బంజరు భూములను సజీవ అడవులుగా మార్చింది. సరళత, కరుణ, అచంచల నిబద్ధత మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా మార్చగలవో ఆమె జీవితం ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. 

నేను కర్ణాటకను సందర్శించినప్పుడల్లా.. ఆ రాష్ట్ర పర్యావరణ & అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే నేను తరచుగా ఆమె అసాధారణ ప్రయాణం గురించి మాట్లాడుకుంటాము.- ఆమె స్థితిస్థాపకత, పర్యావరణ పరిరక్షణ పట్ల ఆమెకున్న అంకితభావం, రాబోయే తరాలకు ఆమె ఇచ్చిన ప్రేరణ. ఒక వ్యక్తి అంకితభావం స్మారక చిహ్నాల కంటే చాలా గొప్ప వారసత్వాన్ని సృష్టించగలదని తిమ్మక్క అమ్మ నిరూపించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఆమె జీవితం, విలువలు మన అడవులను రక్షించడంలో, పెంపొందించడంలో ఎప్పటికీ మనకు మార్గనిర్దేశం చేస్తాయి.’’ అంటూ తెలిపారు. 

Also Read :  నడిరోడ్డు మీద పట్టపగలు.. భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేసిన భర్త.. కారణమేంటంటే?

సాలుమరద తిమ్మక్క జీవితం ఇలా

సాలుమరద తిమ్మక్క 1911 జూన్ 30న కర్నాటక లోని తూముకూరు జిల్లా గుబ్బి తాలూకాలో జన్మించారు. ఆమె భర్త పేరు చిక్కన్న. ఈ జంటకు పెళ్లయి 20 సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టలేదు. ఆ భాధలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లవుతుందని బావించి మొక్కలు నాటడం ప్రారంభించారు. తిమ్మక్క హులికుల్ నుండి కుడుర్ వరకు ఉన్న జాతీయ రహదారి పక్కన దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర 384 మర్రి చెట్లు నాటి వాటికి ప్రాణం పోశారు. 

వాటిని సొంత బిడ్డల్లా ప్రేమించి జాగ్రత్తగా పెంచి కాపాడారు. చెట్లే కదా నా పిల్లలు అని ఎప్పుడూ చెబుతుంటారు. ఇక భార్య నాటిన చెట్లను జాగ్రత్తగా నీళ్ళు పోసి పెంచడం కోసం భర్త చిక్కన్న జీతం కోసం చేస్తున్న పని కూడా వదిలిపెట్టాడు. అలా ఇద్దరూ కలసి ప్రకృతికి ప్రణామం చేశారు. పదికాలాల పాటు గుర్తుండిపోయేలా చేశారు. పిల్లలు లేని ఈ వృద్ధ దంపతులు మొక్కలనే పిల్లలుగా భావించారు. 1990 లో భర్త చిక్కన్న మరణించాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో ఉమేష్ అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. 

Also Read :  తెలుగు రాష్ట్రాలు గజగజ.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. ఏపీలో మళ్లీ వర్షాలు!

తిమ్మక్క అవార్డులు

1995లో కేంద్రప్రభుత్వం ఆమెను భారతీయ పౌర పురస్కారంతో సన్మానించింది. అలాగే ఈమె పర్యావరణానికి చేసిన కృషికి గుర్తింపుగా 2019లో పద్మశ్రీ అవార్డుతో ప్రభుత్వం గౌరవించింది. ఇవి మాత్రమే కాకుండా ఆమె మరెన్నో అవార్డులు అందుకున్నారు. జాతీయ పౌరసత్వ పురస్కారం - 1, ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు - 1, వీరచక్ర అవార్డు, కర్ణాటక ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖ నుండి అక్రిడిటేషన్ సర్టిఫికేట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ, బెంగళూరుచే ప్రశంసల సర్టిఫికేట్, కర్ణాటక కల్పవల్లి అవార్డు, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ బ్రేవరీ అవార్డు, పంపపతి పర్యావరణ పురస్కారం, బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు, వనామాటే అవార్డు, మగడి వ్యక్తి అవార్డు, శ్రీమత అవార్డు, హెచ్.హోన్నై సోషల్ సర్వీస్ అవార్డు, కర్ణాటక పర్యావరణ పురస్కారం, ఉమెన్స్ ఎలుక అవార్డు, జాతీయ పౌర పురస్కారం, రాజ్యోత్సవ అవార్డు, ఫ్లవర్ ఫ్లవర్ ఫౌండేషన్ విజ్డమ్ స్పిరిట్ అవార్డు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుండి విశాలక్షి అవార్డు, ప్రతిష్టాత్మక 'నాడోజా' అవార్డును గెలుచుకుంది.

Advertisment
తాజా కథనాలు