Nara Lokesh: కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి లోకేష్.. ఆ అంశాలపై కీలక చర్చలు

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఢిల్లీలో పలువురు కేంద్ర మంతులతో భేటీ అయ్యారు. అలాగే బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు ఉన్నారు.

New Update
Nara Lokesh Meets Union Ministers

Nara Lokesh Meets Union Ministers

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఢిల్లీలో పలువురు కేంద్ర మంతులతో భేటీ అయ్యారు. అలాగే బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్లు టీడీపీ తరఫున రాధాకృష్ణన్‌కు తమ మద్దతు తెలిపారు. అలాగే మంత్రి లోకేష్‌ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌తో సమావేశమయ్యారు. ఆయనతో  వలస కార్మికుల శిక్షణ, ఉద్యోగావకాశాలపై చర్చలు జరిపారు. 

అనంతరం కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా గారిని కలిసి యూరియా కొరతను వివరించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరిని కలిసిన లోకేష్.. రిఫైనరీ ప్రాజెక్టుల పురోగతి గురించి చర్చించారు. అలాగే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో కూడా సమావేశమమై పలు అంశాల గురించి మాట్లాడారు. అలాగే కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ అయ్యారు. వీళ్లతో రాష్ట్ర అభివృద్ధి పనుల గురించి చర్చలు జరిపారు. 

Also Read: నెలకు లక్షకు పైగా జీతంతో ఎల్‌ఐసీలో భారీగా ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఆ రోజే!

 కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరిని కలిసిన లోకేష్.. రిఫైనరీ ప్రాజెక్టుల పురోగతి గురించి చర్చించారు. రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ సంస్థ 6వేల ఎకరాల్లో రూ.95వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న రిఫైనరీ – కమ్ – పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కు సంబంధించి పనుల పురోగతిపై చర్చించినట్లు పేర్కొన్నారు. 

Also Read: సైబర్ నేరగాళ్ల నుంచి రూ.5489 కోట్లు స్వాధీనం..

అలాగే కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ అయ్యారు. వీళ్లతో రాష్ట్ర అభివృద్ధి పనుల గురించి చర్చలు జరిపారు. 

Also Read: ట్రంప్, జెలెన్‌స్కీ భేటీకి ముందు ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఏడుగురు మృతి

కేంద్ర షిప్పింగ్, ఓడరేవులు, జలరవాణా శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ గారితో  కూడా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మారిటైమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, పోర్టుల ఆధారిత అభివృద్ధి, జలరవాణా ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు. అలాగే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తో సమావేశమైన లోకేష్.. రాష్ట్రంలోని రోడ్ల విస్తరణ పనుల గురించి చర్చించారు. 

Advertisment
తాజా కథనాలు