ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం3-ఎం5

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సంచలన ప్రయోగం చేపట్టింది. 'CMS 03' శాటిలైట్‌తో కూడిన LVM3M5 ఎయిర్‌క్రాఫ్ట్‌ శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.

New Update
ISRO LVM3-M5 with CMS-03 satellite successfully lifts off from Sriharikota

ISRO LVM3-M5 with CMS-03 satellite successfully lifts off from Sriharikota

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సంచలన ప్రయోగం చేపట్టింది. 'CMS 03' శాటిలైట్‌తో కూడిన LVM3M5 ఎయిర్‌క్రాఫ్ట్‌ శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. సతీశ్ ధావన్ స్పేస్ సెంటల్ షార్‌లో రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించింంది ఇస్రో. ఈ శాటిలైట్‌ బరువుల 4,140 కిలోలు. దీన్ని జియో సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (GTO)లోకి ప్రవేశపెట్టనున్నారు. 

Also Read :  NHAI: నేషనల్ హైవేలపై యాక్సిడెంట్లు.. కేంద్రం కీలక నిర్ణయం

ISRO LVM3-M5 With CMS-03 Satellite Successfully Lifts Off

GTO కక్ష్యలోకి ప్రయోగించిన శాటిలైట్లన్నింటిలో ఇదే అత్యంత బరువైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శాటిలైట్ ద్వారా సమాచార వ్యవస్థను మెరుగుపర్చడంతో సహా సముద్ర వాతావరణ పరిస్థితులు తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. భారత నౌకాదళ కోసమే దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రాల్లో మోహరించిన యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు, భూ నియంత్రణ కేంద్రాలతో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ ఉపగ్రహం తోడ్పడనుంది. దీన్ని జీశాట్‌ 7 ఆర్‌ అని కూడా అంటారు. 2013 నుంచి సేవలు అందిస్తున్న జీశాట్ 7 స్థానంలో దీన్ని ప్రయోగించారు. 

Also Read :  పశువుల ప్రదర్శనలో రూ.21 కోట్ల గేదె మృతి..

Advertisment
తాజా కథనాలు