/rtv/media/media_files/2025/07/30/isro-2025-07-30-07-05-42.jpg)
ISRO
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుతమైన ప్రయోగాన్ని చేపట్టింది. ఈ క్రమంలోనే నేడు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 (GSLV-F16) రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. ఇస్రో చేపడుతున్న ముఖ్యమైన ప్రయోగాల్లో ఇది ఒకటి. ఈ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష రంగం మరింత లక్ష్యాలన్ని అందుకోవాలనే ఉద్దేశంతో చేపడుతుంది. అయితే ఈ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16ను భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం అయినా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేపడుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:10 గంటలకే ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నేడు సాయంత్రం 5:40 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే ఈ వాహక నౌక సూర్య అనువర్తిత కక్ష్యలోకి నాసా, ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది.
ఇది కూడా చూడండి: AI Jobs: మీకు ఏఐ నైపుణ్యాలుంటే భారీగా జీతాలు.. నివేదికలో సంచలన విషయాలు
🌞 Good Morning, India! 🇮🇳
— ISRO InSight (@ISROSight) July 30, 2025
🚀 It’s Launch Day!
Today at 17:40 IST, @isro will launch #NISAR — a historic joint mission with NASA — aboard GSLV-F16 from Sriharikota! 🇮🇳🇺🇸 pic.twitter.com/dqyEuicS8M
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 స్పెషాలిటీ..
ఇస్రో అభివృద్ధి చేసిన ఒక శక్తివంతమైన రాకెట్ జీఎస్‌ఎల్‌వీ. ఇది భూ స్థిర కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉపగ్రహాలు ఈ కక్ష్యలో భూమికి కొంతవరకు స్థిరంగా ఉంటాయి. దీనివల్ల కమ్యూనికేషన్, వాతావరణం, నావిగేషన్ సేవలకు బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ ప్రయోగం ఇస్రో చేపట్టడం వల్ల భారత దేశం సమాచార వ్యవస్థను మరింత మెరుగుపరచడానికే. ఈ ప్రయోగం సక్సె్స్ అయితే అంతర్జాతీయంగా కూడా మరింత ప్రయోజనం లభిస్తుంది.
ఇది కూడా చూడండి: Axiom-4 mission: భూమి మీదకు వచ్చాక శుభాన్షు శుక్లాని బయటకెళ్లనివ్వరు.. ఎందుకంటే?
మూడు దశల్లో జీఎస్‌ఎల్‌వీ
ఇస్రో ఏదైనా ప్రయోగం చేపట్టే ముందు దాన్ని కొన్ని దశల్లోకి సెట్ చేస్తుంది. అయితే ఈ జీఎస్‌ఎల్‌వీ అనేది మొత్తం మూడు దశల్లో పని చేస్తుంది. మొదటి దశలో ఘన ఇంధనంతో పనిచేయగా, రెండో దశంలో ద్రవ, మూడో దశలో క్రయోజెనిక్ ఇంధనంతో నడుస్తాయి. అయితే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద క్రయోజెనిక్ ఇంజిన్ ద్రవ హైడ్రోజ్, ఆక్సిజన్‌ను ఇంధనంగా మార్చుకుంటాయి. అయితే ఇది చాలా కష్టమైనది. ఈ సాంకేతికత అన్ని దేశాల వాళ్లకి ఉండదు. కేవలం కొన్ని దేశాల వారికి మాత్రమే ఉంటుంది. ఇస్రో జీఎస్‌ఎల్‌వీ రాకెట్లలో ఈ సాంకేతికను ఉపయోగిస్తోంది.
ఇది కూడా చూడండి: Shubhanshu Shukla: ISSలో రైతుగా మారిన శుభాన్షు శుక్లా.. మట్టి లేకుండా వ్యవసాయమా..?
భవిష్యత్తులో ఈ ప్రయోగాలు..
ఇస్రో భవిష్యత్తులో ఎన్నో ప్రయోగాలను చేపట్టాలని ప్లాన్ చేసుకుంది. మానవ సహిత అంతరిక్ష యాత్రలు, చంద్రుడిపైకి, అంగారకుడి పైకి మిషన్లు వంటి కొత్త సాంకేతిక ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోగాలన్నీ సక్సెస్ అయితే భారత దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారనుంది. ఇస్రో చేపట్టిన ప్రయోగాలు అన్ని కూడా సక్సె్స్ కావాలని కోరుకుందాం.
ఇది కూడా చూడండి: ప్రాణాలు కాపాడిన AI.. లవర్ మోసం చేసిందని ఏం చేశాడంటే?