/rtv/media/media_files/2025/07/12/axiom-4-mission-2025-07-12-16-37-59.jpg)
Axiom-4 mission:
యాక్సియం-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తిరుగి భూమి మీదకు వచ్చే తేదీ ఫిక్స్ అయ్యింది. ఆయనతోపాటు మరో ముగ్గురు వ్యోమగాముల జులై 14న బయల్దేరనున్నట్లు నాసా గురువారం ప్రకటించన విషయం తెలిసిందే. భారతీయ కాలమానం ప్రకారం జులై 15 మధ్యాహ్నం 3 గంటలకు స్పేస్‌షిప్ ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానుంది. వ్యోమగాములు భూమికి చేరిన తర్వాత 7 రోజులపాటూ క్వారంటైన్‌కు తరలించనున్నట్లు ఇస్రో తాజాగా తెలిపింది.
After returning to Earth, Gp Capt Shubhanshu Shukla will undergo a rehabilitation program to readjust to Earth's gravity after spending 2 weeks in space. 👨🚀
— ISRO Spaceflight (@ISROSpaceflight) July 12, 2025
The rehabilitation program will last approximately 7 days. pic.twitter.com/pOWXwnOFTn
Also Read: Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!
జీరో గ్రావిటీలో గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారని వెల్లడించింది. ISSకు వెళ్లిన మొదటి ఇండియన్ ఆస్ట్రానాట్ శుభాన్షు శుక్లా కావడం గమనార్హం.
Also Read: HBD Shiva Rajkumar: 'హ్యాట్రిక్ హీరో' నిమ్మ శివన్న బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు మీకు తెలుసా!