ప్రాణాలు కాపాడిన AI.. లవర్ మోసం చేసిందని ఏం చేశాడంటే?

ఉత్తరప్రదేశ్ అజంగఢ్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడు ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్యకు యత్నించాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్టు చేశాడు. అది గుర్తించిన మెటా ఏఐ.. వెంటనే పోలీసులను అలర్ట్‌ చేసింది. మొబైల్ నంబర్ ట్రాక్‌ చేసి అతన్ని కాపాడారు.

New Update
AI Meta saves the life

ఓ యువకుడి ప్రాణం కాపాడి ఏఐ భళా అనిపించుకుంది. ఈ ఘటనతో ఏఐ టెక్నాలజీ ఎంత అవసరమో తెలిసిపోయింది. ఆత్మహత్యకు సిద్ధమైన ఓ వ్యక్తిని.. మెటా ఏఐ  అలర్ట్‌తో పోలీసులు రక్షించగలిగారు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఉత్తరప్రదేశ్ అజంగఢ్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని అతని ప్రియురాలు మోసం చేసింది. అంతే కాకుండా తిరిగి బెదిరింపులకు పాల్పడుతోందని శుక్రవారం తెల్లవారుజామున ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్టు పెట్టాడు.

ఆ మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని అందులో రాసుకొచ్చాడు. తనను మోసం చేసిందని ఆత్మహత్యకు యత్నించాడు.  ఆత్మహత్యకు సంబంధించిన మెసేజ్‌ను గుర్తించిన మెటా ఏఐ.. వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని అలర్ట్‌ చేసింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు యువకుడి మొబైల్ నంబర్ ట్రాక్‌ చేసి.. కేవలం 15 నిమిషాల్లోనే అతడి ఇంటికి చేరుకున్నారు. అతనిని కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు