/rtv/media/media_files/2025/04/26/Yb7vsoov4Qosw4xFNdF9.jpg)
Indus Waters Treaty
జమ్మూ కశ్మీర్ టెర్రర్ అటాక్‌తో భారత్ పాకిస్తాన్‌తో ఉన్న సింధూ నది జలాల ఒప్పందం రద్దు చేసింది. ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం 1960 నుంచి వస్తోంది. రెండు దేశాల మధ్య 3 యుద్ధాలు వచ్చానా.. సింధూ నది జలాల ఒప్పందం కొనసాగింది. అయితే ఒప్పందాన్ని ఉన్నపలంగా ఒక దేశ నిర్ణయంతో రద్దు చేయడం కూదరని కూడా ఆ ఒప్పందంలో ఉంది. కానీ పహల్గామ్ ఉగ్రదాడితో ఈ ఒప్పందం నుంచి భారత్ వైదొలింది. ఈ ఒప్పందం ప్రకారం.. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్‌లపై భారతదేశానికి ప్రత్యేక నియంత్రణ లభించింది. అయితే పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు ఇవ్వబడ్డాయి. సింధూ నదీ జలాల ఒప్పంద రద్దు తర్వాత రెండు దేశాల సింధు జలాల కమిషనర్ల సమావేశాలు ఉండవు. పాక్‌తో నదీ ప్రవాహాలపై డేటా షేరింగ్ జరగదు. దీంతో ఆయా నదులపై ప్రాజెక్టు నిర్మాణాలపై భారతదేశానికే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
సింధూ నదీ జలాలు చుక్క కూడా పాకిస్థాన్‌కు చేరకుండా కేంద్ర జల శక్తి శాఖ 3దశల ప్రణాలిక తయారు చేసింది. సింధు పరీవాహక నదుల వెంబడి ఉన్న ఆనకట్టల సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ నీటిని నిల్వ చేస్తామని జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. దాదాపు సంవత్సరానికి 135 MAF ప్రవాహం పాకిస్తాన్‌కు కేటాయించబడింది.
After ending the Indus Treaty, the water of the Indus River was stopped for Pakistan.
— सत्य सनातन 'मोदी का परिवार' (@REAL___HINDUVT) April 24, 2025
Pakistan was desperate for food till now, now it will crave for water too. pic.twitter.com/x13pJ4kh92
Also read: DRDO: హైదరాబాద్ నుంచే పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం..!
పాకిస్తాన్ నీటిపారుదలలో దాదాపు 90 శాతం సింధు పరీవాహక ప్రాంతం. ఆ నదుల నుంచి నీటి సరఫరా ఆగిపోతే.. పాకిస్తాన్‌కు భవిష్యత్తులో నీటి కొరత పెరుగుతుంది. పంటల దిగుబడి తగ్గుతుంది. ఆ దేశంలో కరువు తాండవం చేస్తోంది. ఇవన్నీ అశాంతికి దారితీస్తాయి. ఇప్పటికే పంజాబ్, సింధ్ ప్రావిన్సులలో నీరు లేక అల్లాడిపోతుంది పాక్.
Also read: Pakistan: పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి.. మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్!
సింధూ నదీ ఒప్పందాన్ని నిలిపివేయడంతో వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం చూపడమే కాకుండా పాక్ విద్యుత్ సరఫరాపై తగ్గుతుంది. ఇప్పటికే హైడ్రల్ పవర్ లేక పాకిస్తాన్ థర్మల్ పవర్ కోసం ఏటా దాదాపు 19 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటుంది. బొగ్గు దిగుమతుల ఆర్థిక భారం 2021 నాటికి USD 1.5 బిలియన్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్ GDPలో 60 శాతానికి పైగా అప్పుల్లో కూరుకుపోయింది.
(Indus Waters Treaty | action on pakistan | india on pakistan | indian vs pakistan | attack in Pahalgam | modi on pahalagam attack)