భారత్‌లో తొలిసారిగా పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

భారత్‌లో తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కనుంది. హర్యానాలో దీన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలోని ఈ రైలును రూపొందించారు. ఇది జీంద్‌-సోనీపత్‌ ప్రాంతాల మధ్య పరుగులు తీయనుంది.

New Update
India’s first hydrogen train set to debut in Haryana

India’s first hydrogen train set to debut in Haryana

భారత్‌లో తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కనుంది. హర్యానాలో దీన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలోని ఈ రైలును రూపొందించారు. ఇది జీంద్‌-సోనీపత్‌ ప్రాంతాల మధ్య పరుగులు తీయనుంది. అంతేకాదు ఈ రైలుకు ఇంధనం అందించేందుకు జింద్‌లో హైడ్రోజన్‌ ప్లాంట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 3 వేల కిలోలుగా ఉంది. 11 కేవీల విద్యుత్‌ సరఫరాను ఈ ప్లాంట్‌కు అందిస్తారు.  

Also Read: ప్రధాని మోడీకి సంచలన లేఖ.. ‘POKపై దాడి చేయాలంటూ’

ఆ తర్వాత ఇది రైలుకు నిరంతరాయంగా ఇంధనాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టును సమీక్షించేందుకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్‌ రస్తోగి.. దక్షిణ హర్యానా బిజ్‌లీ వితరణ్‌ నిగమ్ (DHBVN)కు చెందిన అధికారులతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ రైలు ప్రాజెక్టుకు సంబంధించి చివరి దశ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక దేశంలోనే మొదటి హైడ్రోజన్‌ రైలు ఇదే కావడం మరో విశేషం. 

Also Read: అమెరికాని అడ్డుకోవడానికి ఏకమైన ఏడు దేశాలు.. గ్రీన్‌లాండ్‌కి తోడుగా

Advertisment
తాజా కథనాలు