New Update
/rtv/media/media_files/2025/12/22/indian-h-1b-holders-stranded-after-work-permit-renewal-trip-2025-12-22-11-27-06.jpg)
Indian H 1B Holders Stranded After Work Permit Renewal Trip
హెచ్1 బీ వీసాదారులకు మరో షాక్ తగిలింది. అమెరికన్ వర్క్ పర్మిట్ల పునరద్ధరణ(work permit renewal extension) కోసం ఈ నెల భారత్‌కు వచ్చిన వీసాదారుల అపాయిట్‌మెంట్లు వాయిదా పడటంతో ఇక్కడే చిక్కుకున్నారు. వాషింగ్టన్ పోస్టు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 15 నుంచి 26వ తేదీల మధ్య హెచ్1బీ వీసాదారుల(h1b visa) అపాయింట్‌మెంట్లు వాయిదా పడ్డాయి. సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో పాటు అమెరికా హాలిడే సీజన్ రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అభ్యర్థులకు ఈమెయిల్స్ కూడా పంపినట్లు వాషింగ్టన్ పోస్టు తెలిపింది.
H1 B Visa Work Permit Renewal
దీనిపై అమెరికా దౌత్య కార్యాలయ ప్రతినిధి స్పందించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఇప్పటికే విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్ వీసాదారులకు సంబంధించి ఎఫ్, ఎమ్, జే కేటగిరి వీసాలను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తోందని చెప్పారు. డిసెంబర్ 15 నుంచే ఈ ప్రక్రియ మొదలైనట్లు పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భాగంగా హెచ్1బీ, హెచ్4 వీసాదారులను కూడా చేర్చినట్లు వెల్లడించారు. హౌస్టన్ ఆధారిత ఇమిగ్రేషన్ సంస్థకు చెందిన భాగస్వామి ఇమిలీ న్యూమాన్ మాట్లాడుతూ.. భారత్‌లో తమ క్లయింట్లు దాదాపు 100 మంది చిక్కుకున్నారని తెలిపారు.
మరో అమెరికా విదేశాంగ శాఖ అధికారి మాట్లాడుతూ గతంలో ఈ వీసా అపాయింట్‌మెంట్ల ప్రక్రియను వేగంగా చేసేవాళ్లమని అన్నారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ దౌత్య కార్యాలయాలు, కాన్సులెట్లలో వీసాదారులకు నిరీక్షణ సమయాన్ని తగ్గించామని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రతీ వీసాదారుడి విషయంలో వెట్టింగ్ ప్రక్రియకు ప్రాధాన్యత ఉస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. హెచ్1బీ వీసా దారుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉన్నారు.
అంతేకాదు ఈ ఏడాది జులైలో అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటించింది. హెచ్‌బీ 1 వీసాదారులు, వారిపై ఆధారపడ్డ హెచ్4 వీసాదారులు సెప్టెంబర్ 2 నుంచి మూడో దేశంలో తమ డాక్యుమెంట్లు పునరుద్ధరణ(work permit renewals us) చేసుకోలేరని పేర్కొంది. ఇక సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్‌వీ వీసా దరఖాస్తుల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు వెట్టింగ్ పాలసీ వల్ల ఈ వీసా అపాయింట్‌మెంట్ల ప్రక్రియ మరింత ఆలస్యం కావడంతో అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో కొందరికి వచ్చే ఏడాది మార్చి నుంచి ఏప్రిల్ వరకు రీషెడ్యూల్ కాగా.. మరికొందరికి అక్టోబర్ వరకు వాయిదా పడ్డాయి.
తాజా కథనాలు
Follow Us