Bangalore: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్

ఫ్లాట్ మేట్ కావాలి..కండిషన్లు ఇవే..ప్రస్తుతం ఎక్స్‌లో దుమ్ములేపుతున్న పోస్ట్ ఇది. బెంగళూరులో జాబ్ చేసుకుంటున్న నిమిషా అనే యువతి పెట్టిన ఫ్లాట్ మేట్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఏకంగా మూడు లక్షల వ్యూను సొంతం చేసకుంది. దాని కథేంటో మీరూ చదివేయండి.. 

author-image
By Manogna alamuru
New Update
bengaluru

బెంగళూరులో రెంట్‌కు ఇల్లు దొరకడం చాలా కష్టం. ఫ్లాట్ మేట్స్ కావాలంటే మరీ కష్టం. ఇక్కడ చాలా మంది యువతీ యువకులు ఒంటరిగా ఉంటారు. కొంతమంది రూమ్మేట్స్‌గా కలిసి ఉంటారు. ఇండియాలో హ్యాపెనింగ్ సిటీస్‌లో బెంగళూరు ఒకటి. టెక్నాలజీ సిటీగా పేరుగాంచిన బెంగళూరులో ఉండడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే అక్కడ ఫ్లాట్ మేట్స్ దొరకడం చాలా కష్టమని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనే ఒక అమ్మాయి ఎక్స్‌లో పెట్టిన పోస్ట్. 

ఫ్లాట్ మేట్ కోసం పాట్లు..

తనకు ఫ్లాట్ మేట్ కావాలంటూ నిఇషా చందా అనే అమ్మాయి ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఫిమేల్ ఫ్లాట్మేట్ కావాలని ‘ఎక్స్’లో ఆమె పెట్టిన పోస్ట్కు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 23 ఏళ్ల నిమిషా  మార్కెటింగ్ ప్రొఫెషనల్. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే-ఔట్లో త్రీ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్లో మరో యువతితో కలిసి ఉంటోంది. అయితే ముగ్గురు ఈజీగా ఉండొచ్చు. పైగా బెంగళూరు అద్దెలను తట్టుకోవాటంఏ కనీసం ముగ్గురు అయినా కలిసి ఉండాల్సిందే.  ఇంకొక ఫిమేల్ ఫ్లాట్ మేట్ దొరక్కపోతుందా అనే ఉద్దేశంతో నిమిషా, ఆమె రూమ్మేట్ అద్దె ఎక్కువైనా 3BHK ఫ్లాట్ రెంట్కు తీసుకున్నారు. అయితే వీరి ఆలోచన నెరవేరలేదు దాదాపు నెల రోజుల నుంచి ఫిమేల్ ఫ్లాట్ మేట్ కోసం వీళ్లు చేయని ప్రయత్నం లేదు. కానీ.. ఒక్కరు దొరకలేదు. దీంతో.. ఇక లాభం లేదనుకుని కొంచెం కొత్తగా ఆలోచించారు. దాని ఫలితమే ఎక్స్‌లో పోస్ట్. 

ఇది కూడా చదవండి: ఇంట్లో ఈ స్థలంలో డబ్బు ఉంచితే పేదరికం తప్పదు 

మూడు లక్షల వ్యూస్..

అయితే ఈ పోస్ట్ ను ఇద్దరు అమ్మాయిలు మామూలుగా పెట్టేయలేదు. తమ ఫ్లాట్ లో ఉండాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయంటూ...వాటిని ఒక్కొక్కటీ వివరంగా రాశారు. దాంతో పాటూ తమతో ఉంటే లాభాలేంటో కూడా చెప్పారు.  ఇది నెటిజన్లు బాగా ఆకర్షిస్తోంది. ఇలా ఫ్లాట్ మట్ కావాలంటూ ఇప్పటి వరకూ ఎవరూ కొత్తగా పోస్టులు పెట్టలేదు. దానికి తోడు అసలు ఎక్స్‌లో పోస్ట్ పెట్టాలన్న ఆలోచనే కొత్తగా ఉందంటున్నారు. దీంతో నిమిషా పెట్టిన ఫ్లాట్ మేట్ పోస్ట్ కు మూడు లక్షల వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే ఆ పస్ట్ దుమ్ము రేపింది కానీ నిమిషాకు ఫ్లాట్ మేట్ దొరికిందో లేదో మాత్రం తెలియలేదు. ఆ విషయాన్ని కూడా నిమిష కొన్నాళ్ళల్లో పోస్ట్ పెడుతుందేమో చూడాలి మరి. 

ఇది కూడా చదవండి:  పాలలో ఇవి కలుపుకొని తాగితే చలికాలంలో డోంట్‌ వర్రీ

ఇది కూడా చదవండి: ఏపీలో రెండు రోజుల పాటూ దంచికొట్టనున్న వానలు..

ఇది కూడా చదవండి:  జీవితంలో ఈ విషయాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి

 

#bangalore #3BHK Flat #HSR Layout Bengaluru #Nimisha Chanda
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు