/rtv/media/media_files/2025/11/26/indian-constitutions-2025-11-26-15-15-01.jpg)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. భారత రాజ్యాంగం(National Constitution Day 2025) హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇకపై తెలుగువారు కూడా భారత రాజ్యాంగాన్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(draupadi murmu) రాజ్యాంగాన్ని తొమ్మిది భాషలలో డిజిటల్‌గా విడుదల చేశారు. తెలుగు భాష సహా.. మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ, మలయాళంలో రాజ్యాంగాన్ని అనువాదించారు. ఈ రోజు మొత్తం దేశం రాజ్యాంగ నిర్మాతలకు గౌరవం ఇచ్చే రోజు అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
President #DroupadiMurmu releases translated versions of the #Constitution of India in 9 languages, including Malayalam, Marathi, Nepali, Punjabi, Bodo, Kashmiri, Telugu, Odia and Assamese.#SamvidhanDivas#ConstitutionDay#NationalConstitutionDay#SamvidhanSeSamriddhi… pic.twitter.com/BJbO1nWeTN
— All India Radio News (@airnewsalerts) November 26, 2025
Also Read : SIRపై రాష్ట్రాల పిటిషన్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Draupadi Murmu Digitally Released The Constitution In Nine Languages
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారతదేశానిది. ఇందులో 26 భాగాలు, 12 షెడ్యూళ్లు 448 అధికకరణలు ఉన్నాయి. రాజ్యాంగం ఇంగ్లీషు ప్రతిలో దాదాపు 1,17,369 పదాలున్నాయి. ఇంగ్లీషు, హిందీ రెండు కాపీలు చేతితోనే రాశారు. హిందీ, ఇంగ్లీషులో రాసిన రాజ్యాంగం అసలు కాపీలు(new-constitution-copy) హీలియంతో నింపిన ప్రత్యేకమైన కేసుల్లో పార్లమెంటు లైబ్రరీలో భద్రపరిచారు. రాజ్యాంగ ప్రతులను ప్రేమ్ బిహరీ నారాయణ్ అనే వ్యక్తి ఇటాలిక్ శైలిలో అందంగా రాశారు. ఇందుకోసం ఆయన ఆరు నెలల సమయాన్ని వెచ్చించి దాదాపు 254 పాళీలు ఉపయోగించారు. ఇందుకు ప్రతిఫలంగా ఏమి తీసుకోని ప్రేమ్ బిహారీ.. కేవలం తన పేరు ప్రతిపేజీలో ఉండేలా కోరారు. భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చింది1950 జనవరి 26 అన్న విషయం అందరికి తెలుసు. అందుకే ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తారు. అయితే 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పరిగణిస్తారు. 1950 జనవరి 26 ఉదయం 10:18 గంటలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గణతంత్ర రాజ్యంగా అవతరించింది భారత్. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో దాదాపు 283 రాజ్యాంగసభ సభ్యులు సంతకం చేసారు. ఆ సమయంలోనే వర్షంపడటంతో చాలామంది దాన్ని దేశానికి శుభసూచకంగా భావించారు.
అదే రోజు అంటే 1950 జనవరి 26న గణతంత్ర భారత్‌కు తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. అదే సమయంలో స్వతంత్ర భారత్‌కు తొలి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బీఆర్​ అంబేద్కర్ వ్యవహరించారు. తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేసియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1955లో జనవరి 26న తొలిసారి గణతంత్ర పరేడ్ నిర్వహించారు.
Also Read : 10 అడుగుల భూగర్భంలో మదర్సా..ఉగ్రవాది ముజమ్మిల్ ప్లాన్ ఏంటి? దీని వెనుక రహస్యం ఏంటి?
Follow Us