/rtv/media/media_files/2025/12/23/india-2025-12-23-20-33-22.jpg)
India should be prepared for short, long-term conflicts, CDS General Anil Chauhan explains why
ఈ మధ్యకాలంలో వివిధ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు పెరిగిపోవడం ఆందోళనలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణు దేశాలైన చైనా, పాకిస్థాన్ నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉందన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సవాళ్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే సుధీర్ఘ యుద్ధాలకు భారత్ రెడీగా ఉంటాలని సూచనలు చేశారు. ఐఐటీ బాంబేలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: రూ.4వేల నుంచి లక్షా 35వేలు దాకా.. పాతికేళ్లలో గోల్డ్ రేట్ హిస్టరీ ఇదే!
'' మన ఇద్దరు ప్రత్యర్థులకు అణుసామర్థ్యం ఉంది. ఆ దేశాల నుంచి ఎటువంటి సవాళ్లు వచ్చినా ఎదుర్కునేందుకు మనం రెడీగా ఉండాలి. గతంలో చేపట్టిన ఆపరేషన్ల లాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు స్వల్ప, దీర్ఘకాలిక ఘర్షణలకు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం కొనసాగుతున్న సరిహద్దు వివాదాల వల్ల భూతల ఘర్షణల్లో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, హైపర్ సోనిక్స్, ఎడ్జ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ పోరాట తీరును మార్చేస్తున్నాయని'' అనిల్ చౌహన్ అన్నారు.
CDS Gen Anil Chauhan-
— News Arena India (@NewsArenaIndia) December 22, 2025
"We should be prepared to fight short duration, high intensity conflicts to deter terrorism, like Operation Sindoor.
We should be prepared for a land centric, long duration conflict because we have land disputes." pic.twitter.com/eNaab2X1oo
Also Read: 54ఏళ్ల ఇండియా-బంగ్లాదేశ్ ప్రయాణం.. దోస్తానా? దుష్మనా?
Follow Us