రూ.4వేల నుంచి లక్షా 35వేలు దాకా.. పాతికేళ్లలో గోల్డ్ రేట్ హిస్టరీ ఇదే!

గత 25 ఏళ్లలో భారత మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న పసిడి, నేడు లక్ష రూపాయల మార్కును దాటి రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే రూ.2లక్షలకు చేరుకుంటుందని కూడా గోల్డ్ రేట్స్ విశ్లేషకులు చెబుతున్నారు.

New Update
sip vs gold

sip vs gold

ఇండియాలో బంగారం అంటే కేవలం ఓ మెటల్ మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్, సురక్షితమైన పెట్టుబడి, సంపదకు చిహ్నం. గత 25 ఏళ్లలో (2000 నుండి 2025 వరకు) భారత మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న పసిడి, నేడు లక్ష రూపాయల మార్కును దాటి రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే రూ.2లక్షలకు చేరుకుంటుందని కూడా గోల్డ్ రేట్స్ విశ్లేషకులు చెబుతున్నారు.

పది గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం 2000-2010 నిలకడగా ఉంది.

2000 సంవత్సరంలో తులం బంగారం ధర కేవలం రూ.4,400 మాత్రమే. ఆ సమయంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా సులభంగా బంగారాన్ని కొనుగోలు చేసేవారు. 

2005 ఐదేళ్ల తర్వాత ధర రూ.7,000 మార్కును తాకింది. 
2007: మొదటిసారిగా బంగారం ధర రూ.10,000 మైలురాయిని దాటింది.
2010: అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపారు. దీనితో 2010 నాటికి ధర రూ.18,500కు చేరుకుంది. అంటే పదేళ్లలో ధర నాలుగు రెట్లు పెరిగింది.
2011 - 2020: ఒడిదుడుకులు, కరోనా ఎఫెక్ట్ ఈ దశాబ్దంలో బంగారం ధరలు ఎన్నో ఎత్తుపల్లాలను చూశాయి. 
2012: ధర రూ.31,000 దాటినప్పటికీ, ఆ తర్వాత రెండు మూడేళ్ల పాటు ధరలు కొంత మేర తగ్గుతూ లేదా స్థిరంగా కొనసాగాయి.
2015: ధర కొంత తగ్గి రూ.26,343 వద్ద నిలిచింది.
2020: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఫలితంగా అందరూ బంగారం వైపు మళ్లారు. 
ఆగస్టు 2020లో తొలిసారిగా బంగారం రూ.50,000 మార్కును దాటి కొత్త చరిత్ర సృష్టించింది.
2021 - 2025: లక్ష దాటిన పసిడిగత ఐదేళ్లలో బంగారం ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ ఘర్షణలు, రూపాయి విలువ పతనం వంటి కారణాలు ధరను ఆకాశానికి చేర్చాయి. 2023: ధర రూ.65,000 మార్కును అధిగమించింది. 2024:అక్టోబర్ నాటికి పది గ్రాముల బంగారం రూ.80,000 పైన ట్రేడ్ అయ్యింది.2025 డిసెంబర్: ప్రస్తుతం (డిసెంబర్ 2025) భారత మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,32,000 నుండి రూ. 1,35,000 మధ్య కొనసాగుతోంది. గత 25 ఏళ్లలో బంగారం దాదాపు 30 రెట్లు పెరగడం గమనార్హం. భవిష్యత్తులో ఈ ధరలు రూ. 1.5 లక్షలకు చేరుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు