SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో..

ఎప్పుడూ లేనంతగా భారతీయులు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారుట. సంపాదించిన డబ్బులను సేవ్ చేసుకుంటున్నారు. ఎస్బీఐ నిర్వహించిన సర్వే ప్రకారం భారతీయులు బాగా పొదుపు చేస్తున్నారని తేలింది. అందుకే పొదుపులో వరల్డ్‌లో నాల్గవ స్థానంలో ఇండియా ఉందని చెబుతోంది. 

New Update
sbi report

Savings

ఎస్బీఐ Ecowrap series సిరీస్ లో భాగంగా భారతీయుల పొదుపు మీద రీసెర్చ్ చేసింది. ఇందులో భారతీయులు ఈ మధ్యన ఎక్కువగా పొదుపు చేస్తున్నారని తేలింది. ఈ రిపర్ట్ ప్రకారం ప్రపంచ పొదుపు శాతం 28.2 శాతాన్ని మించి ఇండియా 30.2 శాతం పొదుపు రేటుతో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ప్రపంచ దేశాలలో అత్యధికంగా పొదుపు చేస్తున్నవారు మాత్రం చైనా ప్రజలు. ఈ దేశం 46.6 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో రెండు, మూడు స్థానాలలో ఇండోనేషియా (38.1%), రష్యా  (31.7%) ఉన్నాయి. 

పెరిగిన బ్యాంక్ అకౌంట్లు..

ఇండియన్స్‌లో పొదుపు సామర్థ్యం బాగా పెరిగిందని చెబుతోంది ఎస్బీఐ. ప్రస్తుతం 80 శాతం ఇండియన్స్ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండటమే కాకుండా.. పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారుట.  2011లో 50 శాతం అకౌంట్లు కలిగి ఉండగా ప్రస్తుతం 80 శాతం అకౌంట్లకు పెగటమే ఇందుకు నిదర్శమని అంటోంది. అయితే ఓన్లీ ఈ బ్యాంకు అకౌంట్ల ద్వారా మాత్రమే అంచనా వేయలేదని...చాలా రకాలుగా పరిశీలించాకనే రిపోర్ట్ ఇచ్చామని చెబుతోంది ఎస్బీఐ. 

ఎలా దాస్తున్నారు...

ప్రస్తుతం భారతీయుల పొదుపు విధానంలో కూడా చాఆ మార్పులు వస్తున్నాయని తేలింది. కొంతకాలం క్రితం వరకూ క్యాష్ లేదా వెండి, బంగారం రూపలో తమ దగ్గర ఉన్న ఆస్తిని దాచుకునేవారు. కానీ ఇప్పుడు ఫైనాన్సింగ్‌లో భారతీయులకు అవగాహన పెరింగింది. దానిని ఉపయోగించుకుని మ్యూచువ్ ఫండ్స్‌, స్టాక్స్, సిప్‌లు లాంట వాటిల్లో తమ నగదును పెడుతున్నారని చెబుతోంది ఎస్బీఐ. 2018 లో 4.8 కోట్ల SIP అకౌంట్లకు భారత్ చేరుకుందంటే ఫైనాన్షియల్ నాలెడ్జి మనవాళ్ళల్లో ఎంత పెరిగిందో చెప్పవచ్చని అంటున్నారు. గతంలో స్టాక్స్, డిబెంచర్లలో మన ఇండియన్స్ తక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా సేవింగ్, ఇన్వెస్ట్ మెంట్ ఆలోచనలు మారుతున్నాయి. స్టాక్స్, డిబెంచెర్స్ లలో పదేళ్ల క్రితం మన జీడీపీలో 0.2 శాతం మాత్రమే ఉండగా.. 2024 ఆర్థిక సంవత్సరానికి 1 శాతానికి చేరుకోవడమే మనవాళ్ల పొదుపు సామర్థ్యం పెరిగింది అనడానికి నిదర్శనం అని ఎస్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. 

Also Read: NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు