NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..

అంతరిక్షలో చిక్కుకుపోయిన వ్యోమగామలు సేఫ్‌గా ఉన్నారు. వారు ఈరోజు అక్కడ క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా తన ఎక్స్‌ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేసింది. 

author-image
By Manogna alamuru
New Update
space

Sunitha Williams Christmas Photograph: (NASA)

ఈ ఏడాది జూన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌లు.. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారక్కడే ఉన్నారు. ఇద్దరు వ్యోమగాములను తీసుకురావడానికి నాసా చాలా ప్రయత్నించింది అయితే అది అవలేదు. మొదట ఫిబ్రవరిలో వారిని తీసుకువస్తామని నాసా చెప్పింది. ఎలాన్ మస్క్‌కు సంబంధింఇన స్పేస్ ఎక్స్ రాకెట్లో తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. అయితే తాజాగా  వచ్చే ఏడాది మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌ మొదటివారంలో వ్యోమగాములను భూమిని చేరుకునే అవకాశముందని నాసా మళ్​ళీ ప్రకటించింది. 

క్రిస్మస్ వేడుకలు...

ఈ క్రమంలో అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు ఆరోగ్యం మీద అనేక అనుమానాలు తలెత్తాయి. వారు చనిపోతారని ఆందోళనలు తలెత్తాయి. అయితే నాసా వీటన్నిటికీ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది. వ్యామగాముల ఆరోగ్యం మీ శ్రద్ధ తీసుకుంటున్నామని...ఎపటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెబుతూనే ఉంది. వ్యోమగాముల ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా సునీతా విలియమ్స్, మిగతా వారు స్పేస్‌లో క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటున్న వీడియోను తన ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేసింది నాసా. ఇందులో సునీతా మాట్లాడారు కూడ. తామందరం బాగానే ఉన్నామని..క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నామని తెలిపారు. భూమి మీద ఉన్నవారందరికీ వ్యోమగాములు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 

 

Also Read: Kambli: సచిన్‌కు థాంక్స్...కోలుకుంటున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు