/rtv/media/media_files/2025/11/04/india-post-2025-11-04-19-58-45.jpg)
India Post
పోస్టల్ సేవల్లో కీలక మార్పులు రానున్నాయి. తమ సేవలు ప్రజలకు మరింత వేగంగా అందించేందుకు తపాలా శాఖ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పోస్టల్ సేవలన్నీ కూడా స్మార్ట్‌ఫోన్‌లో అందించేలా ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'డాక్ సేవ' పేరుతో ఈ యాప్‌ను విడుదల చేసింది. ఇకనుంచి పోస్టాఫీసు మీ జేబులోనే అంటూ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనివల్ల మొబైల్ నుంచే అన్ని రకాల పోస్టల్ సేవలు పొందవచ్చు.
Also Read: పో*ర్న్ సైట్లు నిషేధించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం తపాలా శాఖ అందిస్తున్న అన్ని సదుపాయాలు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు పోస్టల్ విభాగం పేర్కొంది. పోస్టేజ్ కాలిక్యులేషన్, కంప్లయింట్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్, అలాగే పార్సిల్ ట్రాకింగ్ లాంటి సేవలను పొందవచ్చు. అంతేకాదు స్పీడ్‌పోస్టు, మనీఆర్టర్ వివరాలు కూడా రియల్‌టైమ్‌లోనే ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే దేశీయ, అంతర్జాతీయ పార్శిల్ సదుపాయాలకు ఎంత ఛార్జీ అవుతుందో తెలుసుకోవచ్చు. స్పీడ్‌పోస్ట్‌తో పాటు రిజిస్టర్డ్ పోస్టు, పార్శిల్ బుకింగ్ లాంటి సేవలకు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చొనే అవసరం లేకుండా ఈ యాప్‌లోనే అన్ని సేవలు వాడుకోవచ్చు.
Your Post Office in your Pocket. 📱
— India Post (@IndiaPostOffice) November 3, 2025
The services you trust.
The convenience you deserve.
Now together on the Dak Sewa App.
Scan the QR and download today.#DakSewaApp#DakSewaJanSewa#IndiaPost#DigitalIndia#Innovationpic.twitter.com/FytQpJwZLk
Also Read: అయ్యో బిడ్డలు.. తల్లడిల్లిన తాండూరు.. ఎటు చూసినా ఏడుపే.. కన్నీటి యాత్ర!-VIDEO
GPS సాయంతో సమీపంలో ఉన్న పోస్టాఫీసు వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్‌లో Dak Sewa App అని టైప్ చేయాలి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ఇందులో మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీతో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మరిన్ని సేవల కోసం www.indiapost.gov.in అధికారిక సైట్‌లో కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
Also Read: భర్త, పిల్లల్ని వదిలేసి ఇన్‌స్టా ప్రియుడితో భార్య జంప్
Follow Us