/rtv/media/media_files/2025/05/01/AXE1sAqmEkPNF4lZAQjw.jpg)
Surgical Strike
Surgical Strike PM Modi 2025: భారత్(India) రానున్న రెండు, మూడు రోజుల్లో పాకిస్తాన్(Pakistan) పై దండెత్తబోతోందని...తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ నిన్ననే చెప్పారు. ఇతనితో పాటూ మరికొంత మంది నేతలు కూడా యుద్ధం గురించి మాట్లాడారు. అలాగే అర్జెంటుగా అమెరికా కూడా భారత్, పాక్ రెండు దేశాలతోనూ మాట్లాడింది. యుద్ధం గురించి కనుక్కుంది. ఈ పరిణామాలన్నింటి నడుమ భారత్ యుద్ధానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
Also Read: ఆ వ్యాధులు ఉన్న వారు చెరుకు రసం అస్సలు తాగొద్దు.. షాకింగ్ విషయాలు!
ఈరోజు రాత్రికే..
పాక్ మీడియా, మంత్రుల స్టేట్ మెంట్ల ప్రకారం భారత్ ఈరోజు రాత్రికి దాయాది దేశంపై సర్జికల్ స్ట్రైక్ మొదలెట్టబోతోంది. రేపు ప్రధాని మోదీ భారత జాతిని ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వనున్నారని సమాచారం. దీనికి సంబంధించి పాకిస్తాన్ మీడియా గగ్గోలు పెడుతోంది. వాళ్ళ మీడియాలో ఈరోజు నుంచే యుద్ధమని వార్తలు ప్రసారం అవుతున్నాయి. దాంతో పాటూ పాక్ సమాచార మంత్రి అతుల్లా తరార్ చెప్పిన టైమ్ కూడా ఈరోజే. దాంతో యుద్ధం కన్ఫామ్ అనే వార్తలకు బలం చేకూరుతోంది. దానికి తోడు నిన్న భారత ప్రధాని, రక్షణమంత్రి, క్యాబినెట్ తో అత్యవసర సమావేశాలను నిర్వహించారు. సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించే ఇవి కూడా జరిగాయని చెబుతున్నారు.
పుల్వామా, యురి తర్వాత కూడా..
ఇక ఇంతకు ముందు విషయాలను పరిశీలిస్తే...2019లో పుల్వామా దాడులు జరిగిన తరువాత పది రోజులకు భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. దాని ప్రకారం చూసినా కూడా ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగి దాదాపు ఎనిమిది రోజులు అయింది. అందుకే భారత ప్రభుత్వం ఈరోజు రాత్రికే సర్జికల్ స్ట్రైక్ ను ప్లాన్ చేస్తోందని అంచనాలు వెలువడుతున్నాయి.
Also Read: 10, 12 తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!
Midnight panic in Islamabad? doing pressers at 3am
— Nabila Jamal (@nabilajamal_) April 30, 2025
Pakistan's Info Minister Attaullah Tarar claims India might carry out military action in the next 24–36 hours#IndiaPakistan pic.twitter.com/ni3XCtWjKm
ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మోహరింపు..
మరోవైపు త్రివిధ దళాలకు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాయు, జల దళాలు ఇప్పటికే తమ ఆయుధాలను పరీక్షించేసుకున్నారు. భారత ఆర్మీ రెడీగా ఉంది. ఈ క్రమంలో భారత సైన్యం మరో ముందడుగు వేసింది. పాక్ మిలటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించేందుకు వీలు లేకుండా నావిగేషన్ వ్యవస్థలను జామ్ చేసేసింది. దీన్నే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటారు. ఈ వ్యవస్థలను భారత సైన్యం పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకొంటాయి. దీని వలన దాయాది సైనిక, పౌర రవాణా ఫ్లైటు ఉపయోగించే జీపీఎస్, గ్లోనాస్, బైడూస్ నేవిగేషన్ వ్యవస్థలను సమర్ధవంతంగా అడ్డుకోవచ్చును. యుదధం జరుగుతున్నప్పుడు భారత యుద్ధ విమానాలను, డ్రోన్లు, గ్రైనేడ్స్, మిస్సైల్స్ లాంటి వాటిని గుర్తించడంలో పాకిస్తాన్ ఇబ్బంది పడుతుంది. దాని కారణంగా వారికి తెలియకుండా వారి నెత్తిన బాంబులు కురుస్తాయి.
today-latest-news-in-telugu | india | pakistan | surgical-strike
Also Read: Bengal: యుద్ధ భయంతో భారత ఆర్మీని టార్గెట్ చేస్తున్న పాక్ టెర్రరిస్టులు