/rtv/media/media_files/4Y1zb8cUV5q2Ps75MRkC.jpg)
ICSE 10th, ISC 12th class results released
BIG BREAKING: 2024–25 విద్యా సంవత్సరం ICSE 10, ISC 12వ తరగతి ఫలితాలను 'కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ బోర్డు' విడుదల చేసింది. విద్యార్థులు cisce.org, results.cisce.org వెబ్‌సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు. ఇక ISC 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 18 నుండి మార్చి 27 వరకు జరిగాయి. ICSE 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21 నుండి మార్చి 27 వరకు భారతదేశంలోని అనేక కేంద్రాలలో జరిగాయి. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
The #CISCE results for ICSE Class X and ISC Class XII 2025 will be available soon on #DigiLocker! Check your results quickly and securely. https://t.co/tatAelhw7U
— DigiLocker (@digilocker_ind) April 30, 2025
Stay tuned for updates! pic.twitter.com/6y8AFPDnTA
Also Read: సింహాచలం చందనోత్సవంలో విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
ICSE ఫలితాలు ఎలా చూడాలంటే..
* results.cisce.org సందర్శించండి.
*10 లేదా 12వ తరగతి ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
* మీ ప్రత్యేక ID, CAPTCHAను ఎంటర్ చేయండి.
* మీ స్కోర్‌కార్డ్‌ను సరిచూసుకుని డౌన్‌లోడ్ చేసుకోండి.
* అన్ని వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి.
* మీరు ఏదైనా తప్పును గుర్తిస్తే వెంటనే బోర్డును సంప్రదించండి.
* ప్రతి సబ్జెక్టులో 33% మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధించినట్లు.
Also Read: BIG BREAKING: మమ్మల్ని కాపాడండి...ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన పాక్
ఇదిలా ఉంటే.. నేడు తెలంగాణ పదొవ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హజరయ్యారు.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రవీంద్రభారతి వేదికగా ఫలితాలను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు.రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
telugu-news | today telugu news