/rtv/media/media_files/2025/05/09/fZQitzPe0jSoLYc3Mykp.jpg)
Pakistan MP rips apart PM Shehbaz Sharif, calls him coward
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి జమ్మూతో పాటు రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు యత్నించింది. కానీ మన భారత సైన్యం ఈ దాడులను తిప్పికొట్టింది. పాక్ ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లను కూల్చివేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌లోని లాహోర్‌తో పాటు పలు ప్రాంతాల్లో దాడులకు దిగింది. దీంతో ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మళ్లీ భారత్ పాక్‌పై దాడులు చేయొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని ఇప్పటికే రక్షణశాఖ ప్రకటించింది.
Also Read: 'గుజరాత్ సీఎంను కాల్చిచంపిన పాక్ ఆర్మీ'.. సందర్శన కోసం వెళ్తుండగా అటాక్!
అయితే ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌కు నిరసన సెగ తగులుతోంది. ఆ దేశ రాజకీయ నేతలే ఆయనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గురువారం ఓ పాకిస్థాన్ ఎంపీ పార్లమెంటులో మాట్లాడుతూ షెహబాద్ షరీఫ్ పిరికివాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేరాకాదు ఈ ఎంపీ అప్పట్లో మైసూర్ రాజైన టిప్పు సుల్తాన్ చెప్పిన సూక్తిని కూడా ప్రస్తావించారు. '' ఒక సమూహానికి పులి నాయకత్వం వహిస్తుందంటే ఆ సమూహంలో ఉన్న పిరికివాళ్లు కూడా పులిలాగే పోరాడుతారు. కానీ పులులు ఉన్న గ్రూప్‌కు పిరికివాడు నాయకత్వం వహిస్తే.. ఆ గ్రూప్‌లో ఉండే పులులు కూడా పిరికివాడిలా పోరాడుతాయని'' అన్నారు.
"Jab aapka leader buzdil ho, woh Modi ka naam na le sake..." -Pakistani MP slams Prime Minister Shehbaz Sharif#ViralVideo #Viral #Trending #Pakistan #India #Modi #ShehbazSharif pic.twitter.com/x1Mhq707iT
— TIMES NOW (@TimesNow) May 9, 2025
Also Read: సైన్యం ఉగ్రవాదులు చెట్టాపట్టాల్...పాక్ బండారం బట్టబయలు
దేశం కోసం పోరాడుతున్న పాకిస్థాన్ సైనికులు తమ నాయకుడు (షెహబాద్ షరీఫ్) ధైర్యంగా పోరాడాని అనుకుంటున్నారు. కనీసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు కూడా చెప్పలేని పిరికి నాయకుడు ఉంటే.. సరిహద్దుల్లో పారాడుతున్న పాక్ సైనికులకు ఎలాంటి సందేశం ఇస్తు్న్నట్లు అని'' ఆ ఎంపీ ధ్వజమెత్తారు.
Also Read: రక్తదానాలకు సిద్ధంగా ఉండండి...దేశపౌరులకు పిలుపునిచ్చిన FAIMA
telugu-news | rtv-news | pm shehbaz sharif | international