Vikram Misri: సైనిక దాడుల్లో ఉగ్రవాదులను మాత్రమే చనిపోయారు.. విక్రమ్ మిస్రీ

ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు మాత్రమే హతమయ్యారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ దాడుల్లో పాకిస్థాన్‌ పౌరులు చనిపోయారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.

New Update
Vikram Misri

Vikram Misri

ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు మాత్రమే హతమయ్యారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ దాడుల్లో పాకిస్థాన్‌ పౌరులు చనిపోయారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. భారత సైనిక దాడుల్లో మరణించిన ముగ్గురు టెర్రరిస్టుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారులు హాజరైన చిత్రాన్ని ఆయన చూపించారు. శవపేటికలపై పాక్ జెండాలు కప్పి ప్రభుత్వ లాంఛనాలతో పౌరులకు అంత్యక్రియలను నిర్వహిస్తారా ? అంటూ ప్రశ్నించారు. 

Also Read: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన రష్యా S-400.. ఎలా పని చేస్తోందో తెలుసా?

'' మే 7న భారత్ జరిపిన సైనిక దాడులు ఉగ్రస్థావరాల పైనే జరిగాయి. ఈ దాడుల్లో ఎవరైనా పౌరులు చనిపోతే  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తారా?. శవపేటికలపై పాక్ జెండాలు కప్పి, ప్రభుత్వం గౌరవం ఇవ్వడం కూడా వింతగా ఉంది. చనిపోయిన వ్యక్తులు ఉగ్రవాదులే. అలాంటి వాళ్లకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం అనేది పాకిస్థాన్ ఆచారం కావచ్చు. మతపరమైన ప్రదేశాలపై కూడా భారత్‌ దాడి చేసిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇది పూర్తిగా అబద్ధమని'' విక్రమ్ మిస్రీ అన్నారు.   

మరోవైపు ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి కూడా మరో కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్‌ కొనసాగుతోందని.. తాము పాకిస్థాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొంది. పాకిస్థాన్ భారత మిలిటరీ స్థావరాలపై దాడులు చేసేందుకు యత్నించదన్నారు. కానీ పాక్‌ క్షిపణులను భారత సైన్యం తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. అలాగే పాకిస్థాన్ ఎయిర్‌ ఢిఫెన్స్‌ యూనిట్లను ధ్వంసం చేసిందని చెప్పారు.'' నిన్న పాకిస్థాన్ ఆర్మీ భారత్‌లోని చాలా ప్రాంతాల్లో వైమానిక దాడులకు యత్నించింది. కానీ ఈ దాడులను మన భద్రతా వ్యవస్థ తిప్పికొట్టింది. 

Also Read: 15 నిమిషాలు పవర్ ఇవ్వండి.. పాక్ ను నాశనం చేస్తాం.. MIM సంచలన ప్రకటన!

పాకిస్థాన్‌కు చెందిన చాలావరకు ఎయిర్ ఢిఫెన్స్‌ సిస్టమ్స్‌ను కూడా భారత్‌ ధ్వంసం చేసింది. లాహోర్‌ ఎయిర్ డిఫెన్స్‌ సిస్టన్‌ నాశనమయ్యింది. LOC వెంట పాక్ కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 16 మంది పౌరులు మృతి చెందారు. భారత్ ఇప్పుడు గట్టిగా బదులిస్తోంది. పాకిస్థాన్.. క్షిపణులు డ్రోన్లతో శ్రీనగర్, జమ్మూ, పంతాన్‌కోట్, అమృత్‌సర్‌, జలంధర్, భాటిం, చండిఘర్, భూజ్ తదితర ప్రాంతాలపై దాడులు చేసేందుకు యత్నించింది. ఈ దాడులను మన రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. పాక్ క్షిపణి, డ్రోన్‌ శిథిలాలను స్వాధీనం చేసుకుటున్నామని'' సోఫియా ఖురేషీ అన్నారు.   

national-news | Indian Army | vikram misri | foreign secretary foreign secretary vikram misri 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు