/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Jaishankar-jpg.webp)
అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20న (సోమవారం) ప్రమాణస్వీకారానికి చేయనున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని వైట్‌హౌస్ నుంచి ఇండియాకి ఆహ్వానం అందింది. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత ప్రభుత్వం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి S. జైశంకర్ పాల్గొననున్నారు. ట్రంప్, వాన్స్ ఇన్విటేషన్ మేరకు ప్రారంభ కమిటీ, మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ విషయాన్ని తెలిపింది. డొనాల్డ్ J. ట్రంప్ ప్రమాణస్వీకారంలో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తుందని స్టేట్స్ ఆఫ్ అమెరికా MEA ఓ ప్రకటనలో తెలిపింది.
Read also : సైనిక్ స్కూల్ 2025 ఎంట్రన్స్ అప్లికేషన్ లాస్ట్‌డేట్ ఇదే.. వెంటనే అప్లై చేయండి
ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీని కూడా ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఆవ్వానించారు. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోలను కూడా అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమానికి పిలిచారు.
Also read: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు
ఈ కార్యక్రమం అమెరికా రాజధాని వాషింగ్టన్ DCలోని వెస్ట్ ఫ్రంట్‌లో జరగనుంది. ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ ప్రసంగించి, కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తారు. స్టాచ్యూరీ హాల్‌లో కాంగ్రెస్, సుప్రీం కోర్ట్ సభ్యులతోపాటు విందులో పాల్గొంటారు. పెన్సిల్వేనియా అవెన్యూలో సైనిక సమీక్ష, అధ్యక్ష పరేడ్ నిర్వహింస్తారు.
Also Read: లిక్కర్ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి భారీ నష్టం.. కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు