సైనిక్ స్కూల్ 2025 ఎంట్రన్స్ అప్లికేషన్ లాస్ట్‌డేట్ ఇదే.. వెంటనే అప్లై చేయండి

2025-26 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతి ప్రవేశాలకు ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ కోసం ఎన్‌టీఏ దరఖాస్తులు స్వీకరిస్తుంది. జనవరి 13 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్ సైట్ aissee2025.ntaonline.inలో అప్లై చేసుకోవచ్చు.

author-image
By K Mohan
New Update
sinik school

sinik school Photograph: (sinik school)

ఆర్మీ స్కూల్‌లో చదువుకోవాలనుకునే వారికి, వారి తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్. రాబోయే విద్యా సంవత్సరం (2025-26)లో ఆరు, తొమ్మిది తరగతి ప్రవేశాలకు ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ కోసం ఎన్‌టీఏ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ప్రతిఏటా ప్రవేశ పరీక్షలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిర్వహిస్తోంది. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పరీక్ష తేదీని NTA ప్రకటించలేదు. కానీ.. ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అందుకు లాస్ట్ డేట్ కూడా దగ్గర పడింది.

Also Read :  సంక్రాంతికి ఏ పని తలపెట్టిన.. అసలు తిరుగే ఉండదు

జనవరి 13న అప్లికేషన్‌కు లాస్ట్ డేట్. అంటే (రేపే) సోమవారమే లాస్ట్ డేట్. ఈ స్కూళ్లన్నీ సీబీఎస్‌ఈ అనుబంధ ఇంగ్లీష్‌ మీడియం రెసిడెన్షియల్‌ పాఠశాలు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నేవీ అకాడమీ, ఇతర అకాడమీలకు ఇక్కడ శిక్షణ ఇచ్చి విద్యార్థులను సైనికుల్లాగా సిద్ధం చేస్తుంటారు. ఆఫ్​లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే ఉంటాయి.

Also Read :  KTR అవినీతి చేయలేదని చెప్పలేదే..  ఎమ్మెల్యే  దానం యూటర్న్

ఆరోతరగతికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు మార్చి 31, 2025 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. బాలికలకు కూడా ప్రవేశాలు ఉన్నాయి. తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయస్సు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి. 8వ తరగతి తప్పక పాసై ఉండాలి. జనరల్‌, డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్నవారి పిల్లలు, ఓబీసీలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ పిల్లలకు రూ.800 దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.650ల అప్లికేషన్ ఫీజు. జనవరి 14 రాత్రి 11.50గంటల వరకు అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఎంట్రన్స్ టెస్ట్‌ రిజిస్టేషన్‌కు గడువు ఉంది. సైనిక్ పాఠశాలలో 6, 9 తరగతుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారికి ఈ చక్కటి అవకాశం ఉంది. 6వ తరగతి, 9 తరగతులకు అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులు aissee2025.ntaonline.inలో దరఖాస్తు చేసుకోవాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు