Indo-China: భారత్, చైనా సంబంధాల్లో పురోగతి.. ప్రధాని మోదీ

భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని..స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు.  చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ని కలిసిన తర్వాత మోదీ ట్వీట్ చేశారు. 

New Update
indo-china

PM Modi, Wang YI

చాలా ఏళ్ళ తర్వాత భారత్, చైనాలు స్నేహ హస్తాన్ని చాచుకుంటున్నాయి. రెండు దేశాలు దౌత్య పరమైన సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల నేతలూ వరుసగా చర్చల్లో పాల్గొంటున్నారు. తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రధాని మోదీని కలిశారు. వాంగ్ యి ని కలవడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. భారత్, చైనా సంబంధాల్లో పురోగతి కనిపిస్తోందని అన్నారు. గత ఏడాది రష్యాలో కజాన్ లో చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ తో భేటీ తర్వాత రెండు దేశాల సంబంధాల్లో మార్పులు వచ్చాయని మోదీ అన్నారు. పరస్పర ప్రయోజనాలను, సున్నిత అంశాలను గౌరవించడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు.వాంగ్ యీ భేటీ తర్వాత ఇది మరింత మెరుగుపడిందని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

ఆగస్టు చివరల్లో చైనాకు ప్రధాని మోదీ..

రెండు రోజుల పర్యటనకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్ కు వచ్చారు. ఈయన ప్రధాని మోదీతో పాటూ  భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్,   విదేశాంగ మంత్రి జైశంకర్‌ మరి కొందరు మంత్రులతో సమావేశం అయ్యారు. దీని తర్వాత భారత ప్రధాని మోదీ ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరిగే ఎన్సీవో సదస్సుకు హాజరవుతారని...అజిత్ ధోవల్ అధికారికంగా ప్రకటించారు. గల్వాన్ ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చైనా పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణలో కీలక పరిణామంగా పరిగణిస్తున్నారు. ఈ పర్యటనలో మోదీ కేవలం ఎస్సీవో సదస్సులో పాల్గొనడమే కాక చైనా ప్రధాని జిన్ పింగ్ ను కూడా కలవనున్నారు. రెండు దేశాల దౌత్య సంబంధాలు, ట్రంప్ టారీఫ్ లు, రస్యా చుమురు వంటి విషయాలపై ఇరుదేశాధినేతలూ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

రెండు దేశాల మధ్యా విభేదాలు..


చైనా, భారత్ కు మధ్య సరిహద్దు వివాదాలు చాలా ఉన్నాయి. ఒకవైపు లడక్ లోని గల్వాన్ సంఘర్షణలు, మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమణలతో పాటూ కోవిడ్ 19 సమయంలో కూడా ఇరు దేశాల మధ్య విభేదాలు వచ్చాయి. గల్వాన్ సంఘర్షణలతో ఇవి మరింత ఎక్కువ అయ్యాయి. అయితే వీటిపై రీసెంట్ గా భారత్, చైనా రెండూ చర్చలు పున:ప్రారంభించాయి. లద్దాఖ్‌ సరిహద్దులో బలగాల ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం, నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, కైలాస మానససరోవర్ యాత్రకు అనుమతి లాంటి విషయాల్లో ఒప్పందం చేసుకున్నాయి.  ఇవి మరింత పురోగతి సాధించే దిశగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పర్యటన కీలకంగా మారింది. ఈరోజు భేటీలో రెండు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సహకార సంబంధాలు మరింత మెరుగుపడేందుకు కృషి చేసేలా చర్చలు జరిగాయి.

Also Read: BREAKING: హిమాచల్ ప్రదేశ్‌లో గంటలోనే రెండు భారీ భూకంపాలు.. భయంతో పరుగులు

Advertisment
తాజా కథనాలు