IND-PAK WAR: ఢిల్లీలో హై అలర్ట్.. చారిత్రాత్మక ప్రదేశాల వద్ద సెక్యూరిటీ

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా చారిత్రక కట్టడాల వద్ద భద్రతను పెంచారు. ఎర్రకోట, కుతుబ్‌మినార్ దగ్గర బలగాలను పెంచడంతో పాటు హైదరాబాద్‌లో కూడా సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.

New Update

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఆపరేషన్ సిందూర్‌కి ప్రతీకారంగా పాక్ సరిహద్దుల్లో దాడికి పాల్పడగా వెంటనే వాటిని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా చారిత్రక కట్టడాల వద్ద భద్రతను పెంచారు. ఎర్రకోట, కుతుబ్‌మినార్‌లో పోలీసులు బలగాలను పెంచారు. 

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

హైదరాబాద్‌లోనూ కట్టుదిట్టడం..

వీటితో పాటు సీసీ కెమెరాలు కూడా అధికంగా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా పర్యవేక్షణ జరుగుతోంది. అలాగే హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాల దగ్గర కూడా సెక్యూరిటీని పెంచారు. గోల్కోండ కోట, చార్మ్‌నార్, సాలార్‌జంగ్ మ్యూజియం, కుతుబ్‌షాహీ సమాధులు వంటి ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.  

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు