భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ కాల్పుల విరమణ కుదిరిన కొన్ని గంటలకే సరిహద్దులో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వరకు పాక్ మళ్లీ రెచ్చగొట్టింది. శనివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని అనేక సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులు జరిపింది.
ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి
ఈ ప్రాంతాల్లో బ్లాక్ అవుట్..
అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్ పురా సెక్టార్లలో కాల్పులు జరిగాయి. వెంటనే భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. కాల్పుల విరమణ తర్వాత కూడా పాక్ మళ్లీ దాడులు చేయడంతో ముందు జాగ్రత్తగా జమ్మూకశ్మీర్, పంజాబ్, అమృత్‌సర్, రాజస్థాన్‌లో బ్లాక్‌అవుట్ విధించారు.
ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
కాల్పుల విరమణ తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు సరిహద్దు రాష్ట్రాల్లో చోటుచేసుకోగా.. ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా సాధారణంగానే ఉంది. అయినా కూడా సరిహద్దు జిల్లాల్లో అధిక భద్రతను కొనసాగిస్తున్నారు. అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్ విధించారు. పాక్ మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుంది ఏమోనని ముందు జాగ్రత్తగా అలర్ట్ విధించారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?
ఇదిలా ఉండగా భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయినట్లు శనివారం సాయంత్రం ఇండియా ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) తన ట్రూత్ సోషల్ ఖాతాలో ట్వీట్ చేశారు. దీనిపై భారత్ స్పందించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి తాము కాల్పుల విరమణకు అంగీకరించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ క్రమంలో పాక్ ప్రధాని యుద్ధంలో గెలిచిమాని చెప్పారు.
ఇది కూడా చూడండి:India On Ceasefire: ఒప్పందాన్ని ఉల్లంఘించడం దారుణం..భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ