BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?

పాకిస్తాన్ లో ప్రభుత్వం కుప్పకూలిందా అంటే అవుననే వినిపిస్తోంది. డిప్యూటీ ప్రధాని సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ కాల్పులు మొదలెట్టడంతో ప్రభుత్వాన్ని ఆర్మీ స్వాధీనం చేసుకుందని అంటున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
pakistan

Pakistan Government

కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే తన వక్రబుద్దిని చూపించింది. సీజ్ ఫైర్ అంటూనే జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ శనివారం కాల్పులకు పాల్పడింది. అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం ఫిరంగి దాడులకు పాల్పడింది. జమ్మూ నుండి పంజాబ్, రాజస్థాన్ వరకు అనేక నగరాలపై డ్రోన్ , క్షిపణి దాడులు జరిగాయి.

కాల్పుల విరమణకు అంగీకరించాక కూడా పాక్ సైన్యం దాడులకు తెగబడ్డానికి కారణం అక్కడి ప్రభుత్వాన్ని ఆర్మీ తన చేతుల్లోకి తీసుకోవడమే అని వార్తలు వినిపిస్తున్నాయి. సీజ్ ఫైర్ చేసిన 4 గంటల్లోనే పాక్ ఆర్మీ సరిహద్దుల్లో కాల్పులకు తెగ బడింది. దీనికి కారణం పాక్ ప్రభుత్వం పూర్తిగా ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెబుతున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ ఛీప్ ఆసిమ్ మునీర్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని చెబుతున్నారు. ఆసిమ్ మునీర్ కు సీజ్ ఫైర్ ఇష్టం లేదని అంటున్నారు. అందుకే అమెరికా ఆజ్ఞలను ధిక్కరించి మరీ దాడికి దిగారని సమాచారం. కార్గిల్ వార్ తర్వాత పాకిస్తాన్ ముషరాఫ్ స్వాధీనం చేసుకున్నట్టే ఇప్పుడు కూడా ఆసిమ్ మునీర్ ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకుంటారనే వార్తలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. 

 today-latest-news-in-telugu | government

Advertisment
తాజా కథనాలు